జమ్మలమడుగు టీడీపీలో వర్గపోరు

10 Apr, 2016 20:28 IST|Sakshi
జమ్మలమడుగు టీడీపీలో వర్గపోరు

జమ్మలమడుగు: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు టీడీపీలో వర్గపోరు మరోమారు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ప్రాబల్యం ఉన్న పెదదండ్లూరులో రామసుబ్బారెడ్డి ఆదివారం విందుకు హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే ఆది అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రామసుబ్బారెడ్డిని విందుకు ఎందుకు పిలిచారని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటుచేశారు. నేతల ఆధిపత్య పోరుతో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎమ్మెల్యే ఆది టీడీపీలో చేరికను మొదటి నుంచి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.  

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు