రాజకీయ కుట్రతోనే జనగామకు అన్యాయం

9 Sep, 2016 00:29 IST|Sakshi
రాజకీయ కుట్రతోనే జనగామకు అన్యాయం
  • టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు దద్దమ్మలు
  • పట్టణాలను వదిలి గ్రామాలను జిల్లా చేస్తారా 
  • డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి 
  • రఘునాథపల్లి : జనగామ జిల్లా కోసం ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కుట్రతో అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కోసం చేపట్టిన 8వ రోజు దీక్ష శిబిరాన్ని గురువారం నాయకులతో కలిసి ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ  జిల్లా కోసం ప్రజలు గొంతెత్తి నినదిస్తున్నా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్‌పై జిల్లా ఏర్పాటుకు ఒత్తి డి తెచ్చి ప్రజల పక్షాన ఉండాలన్నారు. శాస్త్రీయంగా భౌగోళికంగా జిల్లా కేంద్రం అయ్యేం దుకు అన్ని హంగులు జనగామకు ఉన్నాయన్నారు.
     
    మాజీ మంత్రి విజయరామరావు మాట్లాడుతూ కొత్త జిల్లాల పునర్విభజన ఏకపక్షంగా అశాస్త్రీయంగా ఉందని ఆరోపించారు.  అంతకు ముందు మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యం లో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహిం చారు.  మాజీ ఎమ్మెల్యే  ఆరోగ్యం, డీసీసీబీ వై స్‌ చైర్మన్‌  పుల్లయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగదీష్‌చందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు  నా గేష్, జేఏసీ గౌరవ అధ్యక్షుడు  కైలాసం, జే ఏసీ నాయకులు  యాదవరెడ్డి, జోగారెడ్డి, హ ర్యానాయక్, రవి, బాలస్వామి, చిన్న నగేష్, లిం గాజీ,  రమేష్,  జయరాములు, చందన, మూ డ్‌ధర్మ, అశోక్, శ్రీను, నర్సింహ పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు