కళాకారులకు గుర్తింపు కార్డులివ్వాలి

12 Dec, 2016 23:54 IST|Sakshi
జానపద కళాకారుల సంక్షేమ సంఘం  
అనంతపురం కల్చరల్‌ : మన సంస్కృతిని ప్రతిబింబించే  జానపద   కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని  కృష్ణదేవరాయల జానపద కళాకారుల సంక్షేమ సంఘం సభ్యులు  డిమాండ్‌ చేశారు.   సోమవారం  ఆ సంఘం కార్యాలయంలో నూతన  కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నరసింహులను  ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. జానపద కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీ వెంకటరాముడు మాట్లాడుతూ  కళాకారులను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపించారు.

2013  తర్వాత ఇప్పటి వరకు గుర్తిపు కార్డులు ఇవ్వలేదన్నారు.  వృద్ధ కళాకారులకు  పింఛన్లనివ్వాలని, ప్రభుత్వ బంజరు భూముల్లో వ్యవసాయం చేసుకునే వీలు కల్పించాలన్నారు. సంక్రాంతి లక్ష్మి పథకం కింద పాడి ఆవులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కృష్ణవేణి, మీనాక్షి, ప్రమీâýæమ్మ, వెంకటలక్ష్మి, గోపాల్‌ , సుబ్బారాయుడు, ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు