కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి స్వాగతం

19 Nov, 2016 23:21 IST|Sakshi
అన్నవరం : 
కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ శనివారం రాత్రి అన్నవరం విచ్చేశారు. ఉత్తరాధికారి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలసి వచ్చిన జయేంద్ర సరస్వతికి దేవస్థానం ఘాట్‌ రోడ్‌ ముఖద్వారంలో వందలాది మంది పండితులు, అర్చకస్వాములు, పురోహితులు, సిబ్బందితో కలిసి దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఘనస్వాగతం పలికారు. కారులో ఉన్న స్వామీజీకి పండితులు మం త్రోచ్ఛారణతో హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన సత్యగిరి మీద ఉన్న అతిథి గృహా నికి రాత్రి బసకు వెళ్లారు. ఉదయం ఆరు గంటలకు స్వామీజీ సత్యదేవుని ఆలయానికి విచ్చేసి గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు, శంకరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. సుమారు గంటసేపు ఈ పూజలు కొనసాగుతాయి. అనంతరం ఉదయం తొమ్మిది నుంచి మ«ధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొండ దిగువన  పంపా సత్రంలో స్వామీజీ శ్రీ మహాత్రిపురసుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి పూజ నిర్వహించనున్నారు. ఈ పూజ కోసం వంద బిందెల పరిశుద్ధ జలం సిద్ధం చేస్తున్నారు. సుమారు మూడు గంటలపాటు జరిగే ఈ పూజను భక్తులంతా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు స్వామీజీ విశాఖపట్నం బయల్దేరి వెడతారు. స్వామీజీని దర్శించేందుకు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రానున్నారు. శనివారం రాత్రి 11 గంటలు దాటాక ఆయన రత్నగిరి చేరుకుని బస చేస్తారు. ఆదివారం ఉదయం స్వామీజీతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం దేవస్థానంలో నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో కూడా మంత్రి పాల్గొంటారు.
 
మరిన్ని వార్తలు