తాగునీటి కాలుష్యం వల్లే చాపరాయి మరణాలు

30 Jun, 2017 00:03 IST|Sakshi
తాగునీటి కాలుష్యం వల్లే చాపరాయి మరణాలు
జేసీ ఎ.మల్లికార్జున
 రంపచోడవరం: తాగునీరు కలుషితం కావడం వల్లే చాపరాయి గ్రామంలో 16 మంది మృతి చెందినట్టు పరిశోధనలో తేలినట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీఓ దినేష్‌కుమార్‌తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాపరాయి గ్రామంలోని వాగులో ఆవు చనిపోయిందని, దాంతో ఆనీరు కలుషితం అయ్యిందన్నారు. ఆనీటిని తాగడం వల్లే 16 మంది అనారోగ్యం పాలై మరణించారని తెలిపారు. గిరిజన కుటుంబాల్లో ఆహారపు అలవాట్లు, తాగునీటి వినియోగంపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటి వరకు ఆ గ్రామంలో 275    వాటర్‌ ఫిల్టర్లను అందజేశామన్నారు. మరో 275 ఫిల్టర్లను త్వరలో అందిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో ‘చంద్రన్న సంచార వైద్యసేవ’లను మరింత పటిష్టం  చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఏజెన్సీలో సమాచార వ్యవస్థ అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో ఈశాట్, శాటిలైట్‌ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చి స్థానిక గిరిజన యువకుల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేలా కలెక్టర్‌ కార్యాచరణ రూపొందిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏజెన్సీలో నెలకొన్న పరిస్థితుల దృష్టా‍ ‍్య అధికారులెవరూ సెలవులు పెట్టవద్దన్నారు. డివిజనల్‌ పంచాయతీ అధికారులు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీములను నియమించి పారిశుద్ధ ‍్య కార్యక్రమాలు  క్రమం తప్పకుండా జరిగేలా చూస్తామన్నారు. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో  దోమల నిర్మూలకు కిటికీలకు దోమల మెష్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. డీసీహెచ్‌ఎస్‌ జి.రమేష్‌కిషోర్, డీఎంహెచ్‌ఓ కె.చంద్రయ్య, ఈఈ పీకే నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రాజేశ్వరరావు, డీఎల్‌పీఓ రాజ్యలక్ష్మి,డీఎంఓ జోగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు