జేసీ దివ్య సుడిగాలి పర్యటన

20 Jul, 2016 20:09 IST|Sakshi

అష్ణగుర్తి (వైరా): మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని నీడను ఇచ్చే చేట్టు తల్లిలా కాపాడుతుందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దివ్య అన్నారు. బుధవారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. అష్ణగుర్తి గ్రామంలోని జెడ్పీఎస్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటి అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణ, గ్రామం పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం పాఠశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం కట్టెల పోయ్యిమీద కాకుండా గ్యాస్‌ పొయ్యి మీద వండాలని, గ్రామంలో నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, ఎంపీపీ బొంతు సమత, సర్పంచ్‌ గుమ్మా చంద్రకళ, తహసీల్దార్‌ డి.సైదులు, ఎంపీడీఓ జి మదుసుదన్‌రాజు, ఎంఈఓ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ నళిన్‌ కుమార్, పంచాయితీ కార్యదర్శి సీహెచ్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు