జూనియర్‌ కాలేజీల బంద్‌ విజయవంతం

4 Jan, 2017 00:06 IST|Sakshi
– కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌
– బంద్‌లో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ సంఘాలు
కర్నూలు (సిటీ):  జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఒకేషనల్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన  కాలేజీల బంద్‌ విజయవంతమైంది. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ సంఘాల నాయకులు వేర్వేరుగా బృందాలుగా ఏర్పడి నగరంలోని  ప్రభుత్వ కాలేజీలను బంద్‌ చేయించారు. ఈ సందర్బంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ  అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేయకపోవడంతో పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందనా​‍్నరు.  తమకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్‌ చేయాలని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు సమ్మె చేస్తే వారిని పట్టించుకోవడం లేదనా​‍్నరు.  ఈనెల చివరిలో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయని, అధ్యాపకులు సమ్మెలో ఉంటే వారి పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మతో  ప్రభుత్వ జూనియర్‌ (టౌన్‌ మోడల్‌) కాలేజీ నుంచి రాజ్‌విహార్‌ వరకు శవయాత్ర నిర్వహించారు.  పోలీసులు  శవయాత్రను అడ్డుకోవడంతో  విద్యార్థి సంఘాలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా కాలేజీల బంద్‌ చేయించి కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.  ఆందోళన కార్యక్రమాల్లో  పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి భాస్కర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఇతర నాయకులు అక్బర్, శివ, రమణ, వినోద్, మోహన్, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4