వైఎస్సార్‌నగర్‌ లబ్ధిదారులకు న్యాయం చేయాలి

1 Dec, 2016 01:40 IST|Sakshi
వైఎస్సార్‌నగర్‌ లబ్ధిదారులకు న్యాయం చేయాలి
నెల్లూరు రూరల్‌: వైఎస్సార్‌ నగర్‌ లబ్ధిదారులకు న్యాయం చేయాలని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య పేర్కొన్నారు. వైఎస్సార్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేతలు బుధవారం  పర్యటించి ప్రజల సమస్యలను ఆరాదీశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇందిరమ్మ శాశ్వత గృహనిర్మాణ పథకంలో 170 ఎకరాల విస్తీర్ణంలో 6500 మందికి పక్కా గృహాలను మంజూరు చేశారని, అయితే ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉండటంతో లబ్ధిదారులు చేరలేదని వివరించారు. అధికార టీడీపీ ప్రభుత్వం వేరే వారికి ఈ గృహాలను కేటాయించాలనుకోవడం దారుణమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఈ ప్రాంతంలో కనీస వసతులను కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌నగర్‌ లబ్ధిదారులకు అండగా ఉంటామని, సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపడతామన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెంచలబాబుయాదవ్, బీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ గాలాజు శివాచారి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ శీలం తిరుపతయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు పత్తి సీతారామ్‌బాబు, మైనార్టీ నాయకులు ఫయాజ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు కేశవనారాయణ, అనిల్, సుమన్, రాజాయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు