జేవీవీ కార్యక్రమాలు ఆదర్శనీయం

26 Sep, 2016 22:29 IST|Sakshi
జేవీవీ కార్యక్రమాలు ఆదర్శనీయం

–ఆర్డీఓ వెంకటాచారి
–ముగిసిన రాష్ట్ర మహాసభలు
నల్లగొండ కల్చరల్‌ : జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని ఆర్డీఓ వెంకటాచారి పేర్కొన్నారు.  జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిసాయి.   రెండవ రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల్లో పెనవేసుకుపోయిన మూఢ విశ్వాసాలను పారదోలుతూ వారిని చైతన్యం చేయడంలో జేవీవీ 30 ఏళ్లుగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మూఢ నమ్మకాలను రూపుమాపాలంటే ప్రతి ఒక్కరికీ సైన్స్‌ పట్ల అవగాహన కలిగివుండాలన్నారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ఇలాంటి సభలు దోహదపడుతాయని పేర్కొన్నారు. జేవీవీ నిర్వహించే కార్యక్రమాలకు తన సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. అనంతరం జేవీవీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.
 గౌరవ అధ్యక్షుడిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వి.ఎం.మనోహర్‌ప్రసాద్, డాక్టర్‌ హెహెచ్‌.మోహన్‌రావు, డాక్టర్‌ మెహతాబ్‌ఎస్‌ బాబ్జి,  అధ్యక్షుడిగా ఫ్రొఫెసర్‌ ఆదినారాయణరావు, ఉపాధ్యక్షుడిగా ఫ్రొఫెసర్‌ కె.లక్ష్మారెడ్డి, ఫ్రొఫెసర్‌ బీఎన్‌.రెడ్డి, అందె సత్యం, ఎ.నాగేశ్వర్‌రావు, డాక్టర్‌ వి.ప్రభావతి, రామరాజు, ప్రధాన కార్యదర్శిగా టి.శ్రీనాథ్, కోశాధికారిగా ఎస్‌.జితేంద్ర, కార్యదర్శులుగా నర్సింహులు, టి.రాజు, ఎ.వెంకటరమణారెడ్డి, డాక్టర్‌ మమత, ఎన్‌.అరుణకుమార్, కస్తూరి ఎన్నికయ్యారు. సబ్‌ కమిటీ కన్వీనర్లుగా   విద్య ఎల్‌వీఎన్‌.రెడ్డి, ఆరోగ్యం, డాక్టర్‌ రమాదేవి, సమత, ఝాన్సీరాణి, శాస్త్ర ప్రచారం ఫ్రొఫెసర్‌ కోయా వెంకటేశ్వర్‌రావు, ప్రచురణలు హరిప్రసాద్, చకుముఖి పి.ఆనంద్‌కుమార్, పర్యావరణం కె.బి. ధర్మప్రకాశ్, సామాజిక న్యాయం సర్వేశ్వర్‌రావు, సాంస్కృతిక ఎ.గోవర్ధన్‌ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు ప్రొఫెసర్‌ రామచంద్రయ్య, టి.రమేష్, లక్ష్మారెడ్డి, నాగేశ్వర్‌రావు, రమాదేవి, సతీష్, ఎన్‌. రత్నకుమార్, శ్రీనివాస్‌రాజు, మమత, బీఎన్‌.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు