పోతలయ్యస్వామి జ్యోతులు మహోత్సవం

2 Mar, 2017 22:35 IST|Sakshi
పోతలయ్యస్వామి జ్యోతులు మహోత్సవం

కనగానపల్లి : కనగానపల్లి మండలం దాదులూరులో పోతలయ్యస్వామికి భక్తులు జ్యోతులు, బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  జాతరలో భాగంగా రెండో రోజైన గురువారం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తులు బోనాలు సమర్పించారు. దీంతో జన సందోహంతో దాదులూరులో భక్తజనంతో నిండిపోయింది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో పన్యారపు బండ్లు కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకొన్నారు. చెన్నేకేశవస్వామి, పోతలయ్య, బంగారు లింగమయ్య స్వాములను దర్శించుకొని పూజలు చేసారు. శుక్రవారం పోతులయ్యస్వామి గావుల మహోత్సవం శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించనున్నారు. 

మరిన్ని వార్తలు