ఉత్సాహంగా జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

11 Sep, 2016 21:28 IST|Sakshi
 
సామర్లకోట :
స్థానిక బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్లో జిల్లా పురుషుల, స్త్రీల కబడ్డీ జట్ల ఎంపిక ఆదివారం జరి గింది. రాజమహేంద్రవరం, కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, కిర్లంపూడి మం డలాల నుంచి వచ్చిన క్రీడాకారులకు పో టీలు నిర్వహించి జట్లను ఎంపిక చేశా రు. ఈ జట్టు వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు సామర్లకోట పట్టణంలో నిర్వహిం చే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొం టాయి. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ పేరుతో 64వ రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల నిర్వాహక కమిటీ కార్యదర్శి బోగిళ్ల మురళీకుమార్‌ (జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు) మాట్లాడుతూ నిర్వాహక కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యవహరిస్తారన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు తాళ్లూరి వైకుంఠం ఆధ్వర్యంలో జట్లను ఎంపిక చేశామన్నారు. 
పురుషుల జట్టు
ఎ. నవీన్‌రాజు, జి. ప్రసాద్, కె. శ్రీని వాసు, కె. ఆర్తివదన్, పి. అజయ్, ఈ నా గేంద్ర, బి. పవన్‌ వెంకటకుమార్, సీహెచ్‌ మణికంఠ, పీవీ దుర్గారావు, కె.వేణు, కేవీఎల్‌ నారాయణ, ఆర్‌.అశోక్‌ ప్రధాన జట్టుకు ఎంపికయ్యారు. అదనంగా జి.ర ఘు, జి. శ్రీను, కె.దుర్గాప్రసా ద్, బి.ఉమామహేశ్వరరావులను ఎంపిక చేశారు.
మహిళల జట్టు
డి.దైవకృప, వి.రోహిణిదేవి, కేవీఎం దు ర్గ, వై.గిరిజా అనంతలక్ష్మి, జీఎస్‌ఎల్‌ఎన్‌ శివజ్యోతి, పి.విజయదుర్గ, కె.సత్యవేణి, ఎం.హేమలత, డి.వేదమణి, యు.లక్ష్మి, ఎస్‌ఎస్‌ఎస్‌ఎల్‌ ప్రసన్న, ఐ.సూర్యభవా ని,ఎన్‌.కావ్య,కె.స్వాతి, ఎన్‌.శిరిషా, జె.సుబ్బలక్ష్మి, డి.కృపామణి, వి.విజయ ఎంపికయ్యారు. కార్యక్రమంలో వీఆర్‌ కెనడీ, కొండపల్లి శ్రీను, గంగిరెడ్డి బలరామ్, మ ట్టా సుబ్బారావు, వెంకటేశ్వరరావు,గోలి సత్తిరాజు, బి. మోహనరావు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు