వైభవంగా సీతారాముల కల్యాణం

10 Jun, 2017 23:06 IST|Sakshi
వైభవంగా సీతారాముల కల్యాణం
  • ముగిసిన కామాక్షీ పీఠం స్వర్ణోత్సవాలు
  • అమలాపురం టౌ¯ŒS : వారం రోజులుగా సాగుతున్న అమలాపురం కామాక్షీ పీఠం మహా సంస్థానం స్వర్ణోత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. ఉదయం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది.  నవగ్రహ దేవతలకు జపాలు, తర్పణాలు, హవనం జరిగాయి. పీఠానికి పంచలోహ విగ్రహాలు అందజేసిన పి.కమల కల్యాణం జరిపించారు. కోళపర్తి శివరామారావు, సత్యశ్రీ దంపతుల చేతుల మీదుగా కల్యాణం జరిగింది. పంచాయతన హోమ ప్రధాన గుండంలో పీఠాధిపతి, 2వ గుండంలో శివరావు దంపతులు, 3వ గుండంలో మాచిరాజు రామకృష్ణారావు దంపతులు, 4వ గుండంలో నిమిషకవి తారకరామ శంకర్‌ దంపతులు, 5వ గుండంలో అడుగుమిల్లి సత్యనారారాయణమూర్తి దంపతులు మహా పూర్ణాహుతి గావించారు. యాజ్ఞికులను పీఠాధిపతి సత్కరించారు. చివరగా చతుర్వేద స్వస్తి, అవబృధ స్నానం, మహదాశీర్వచనాలు జరిగాయి. ద్రాక్షాయణి కామాక్షీ అమ్మవారి పాటలు వీనుల విందుగా పాడారు. అమ్మ వక్కలంక వాణి, అన్నయ్య మర్రి దుర్గారావుల ఆధ్వర్యంలో ప్రేమ మందిరం పిల్లలు తమ వంతు సేవలందించి పీఠాధిపతి ప్రశంసలు అందుకున్నారు.
     
మరిన్ని వార్తలు