పోరాట ఉధృతితోనే ఫలితం

11 Aug, 2017 00:07 IST|Sakshi
పోరాట ఉధృతితోనే ఫలితం
–ముద్రగడ పాదయాత్ర మొదలుపెడితే ప్రభుత్వానికి శ్మశాన యాత్రే
–ఉద్యమం చివర స్థాయిలో ఉంది కాపులంతా రెట్టింపు ఉత్సహంతో పనిచేయాలి
–పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకూ చలో కిర్లంపూడి తరలిరావాలి
–13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు
కిర్లంపూడి: ఉద్యమాన్ని ఎంత తీవ్రతరం చేస్తే ఫలితాలు అంత తొందరగా వస్తాయని 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు అభిప్రాయ పడ్డారు. గురువారం కిర్లంపూడి ముద్రగడ స్వగృహంలో ముద్రగడ ఆధ్వర్యంలో 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు, జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 13 జిల్లాల నుంచి వచ్చిన కాపు జేఏసీ నాయకులు ముద్రగడ పాదయాత్ర భవిష్యత్తు కార్యచరణపై పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్యమం శివరి దశలో ఉందని రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తే తొందరలోనే ఫలితాలు వస్తాయన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు జాతికి రిజర్వేషన్‌లు కల్పిస్తామని, ఏటా వెయ్యి కోట్లు ఇచ్చి కాపుల అభివృద్ధికి పాటుపడతానని, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్తు అందిస్తానని చెప్పి ఇంత వరకూ ఆ హామీలు అమలు చేయకపోవడంతో జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేయడం కోసం  నిరవధిక పాదయాత్ర చేపడితే వేలాది మంది పోలీసుల ఆసరాతో పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు చలో కిర్లంపూడి నినాదంతో 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కాపులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నో పార్టీల జెండాలు మోసి అలసిపోయాం ... ఇప్పటికైనా జండాలు పక్కనపెట్టి ఒకే ఎజెండాతో ముందుకు సాగుదాం అని ముద్రగడ పిలుపునిచ్చారు. కాపులంతా కొదమ సింహాలు ... వారంతా ముద్రగడ వెంటే ఉన్నారు.... చంద్రబాబు వెనుక ఉన్నది పిల్లి పిల్లలు, వ్యక్తిగత స్వప్రయోజలన కోసం చంద్రబాబు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారని మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామాంజనేయులను ఉద్ధేశించి పలువురు జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ రోజు కాపు కార్పోరేషన్‌ పెట్టినా, కాపు రుణాలు ఇచ్చినా ముద్రగడ పోరాటమేనని అన్నారు. జాతి మనుగడ కోసం, జాతి మనుగడ కోసం ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు యావత్తు కాపు జాతి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు