వ్యూహ ప్రతివ్యూహాలు

22 Jan, 2017 23:37 IST|Sakshi
 • ఆరు నూరైనా సత్యాగ్రహ యాత్ర
 • చేపడతామంటున్న కాపు నేతలు
 • అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు
 • ఇప్పటికే షాడో పార్టీలతో నిఘా
 • నేటి నుంచి రంగంలోకి దిగనున్న పోలీసు బలగాలు
 • తాయిలాల పేరుతో కాపుల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వ యత్నం
 • అమలాపురం టౌన్‌ : 
  కాపులను బీసీల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండుతో.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యాన ఈ నెల 25 నుంచి కోనసీమలో జరపతలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రను అడ్డుకునేందుకు.. ప్రభుత్వం గతం మాదిరిగానే ప్రయత్నాలు ఆరంభించింది. గత నవంబర్‌ 16న  జరగాల్సిన ఈ యాత్రను భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపి.. కాపు నేతలను గృహ నిర్బంధం చేసి, ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వాయిదా పడిన ఈ యాత్రను ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకూ నిర్వహించాలని కాపు జేఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ కూడా సిద్ధం చేశారు. ఈ యాత్రను ఆరు నూరైనా ఈసారి నిర్వహించి తీరతామని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క అనుమతి లేదన్న సాకుతో ఈ యాత్రను అడ్డుకుంటామని జిల్లా పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటు కాపు నేతలు, అటు పోలీసుల వ్యూహప్రతివ్యూహాల నడుమ పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన అటు కాపుల్లోనూ.. ఇటు పోలీసు వర్గాలు, అధికార పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది.
  ఎవరి వ్యూహం వారిది
  యాత్ర కోసం ఇప్పటికే కాపు నేతలు కోనసీమలో గ్రామగ్రామానా పర్యటించి, సమావేశాలు ఏర్పాటు చేసి కాపులను సమాయత్తం చేస్తున్నారు. యాత్రను ఎలా అడ్డుకోవాలనే దానిపై జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ కాకినాడలో శనివారం జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వ్యూహాన్ని వివరించారు. మరోపక్క కాపు కార్పొరేష¯ŒS కాపులకు ఇస్తున్న రుణాలపై ప్రభుత్వం జిల్లాలో పలుచోట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రాయితీలను, తాయిలాలను వివరిస్తూ, కాపుల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాపు కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS రామానుజయను జిల్లాలోనే ఉంచి ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఉద్యమ సారథి ముద్రగడపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ యాత్ర వల్ల ప్రయోజనం లేదని జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు.
  సిద్ధమైన యాక్ష¯ŒS ప్లా¯ŒS
  పాదయాత్రను అడ్డుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మూడు అంశాల ప్రాతిపదిక న యాక్ష¯ŒS ప్లా¯ŒS సిద్ధం చేసుకున్నట్లు తెలి సింది. యాత్ర అనివార్యమైతే.. యాత్ర కు అనుమతి తీసుకోకపోతే.. అనుమ తి తీసుకుంటే.. ఇలా మూడు కోణా ల్లో ఏది జరిగినా అందుకు అనుగుణంగా పోలీసు బందోబస్తు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కోనసీమలోని ఒక్కో మండలాన్ని యూనిట్‌గా చేసుకుని ప్రతిచోటా ఒక్కో జిల్లా పోలీసు బలగాలను నియమించేం దుకు కసరత్తు చేస్తున్నారు. అటు మెట్టకు, ఇటు కోనసీమకు ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను సోమవారం దింపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రో¯ŒS కెమెరాలను కూడా సిద్ధం చేస్తున్నారు.
  కాపు నేతల వెన్నంటి నీడలా..
  ఇప్పటికే కాపు ఉద్యమ నేతల కదలికలపై పోలీసులు కన్ను వేశారు. వారివద్ద మఫ్టీలో ఉన్న పోలీసులను షాడో పార్టీలుగా నియమించారు. షాడో పార్టీ కానిస్టేబుళ్లు కాపు నేతల వెన్నంటే ఉంటున్నారు. నేతలు ఎక్కడికి వెళితే వారూ అక్కడకు వెళుతున్నారు. కార్లలో కూడా వారిని అనుసరిస్తున్నారు. కోనసీమలో రాష్ట్ర కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, కాపు జేఏసీ నాయకులు కల్వకొలను తాతాజీ, నల్లా పవ¯ŒSల వెంట ప్రస్తుతం షాడో పార్టీల నిఘా కొనసాగుతోంది.
   
  ఫిబ్రవరి 10 వరకూ జిల్లాలో 144 సెక్ష¯ŒS : కలెక్టర్‌ 
  కాకినాడ సిటీ : శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఫిబ్రవరి 10వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా 144 సెక్ష¯ŒS విధిస్తూ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జనవరి 31న తునిలో జరిగిన కాపు ఐక్యగర్జన, ఫిబ్రవరిలో కిర్లంపూడిలో మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, జూ¯ŒSలో ఆందోళన ఘటనల సందర్భంగా అవాంఛనీయ, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకే ఈ ఉత్తర్వులు ఇచ్చామన్నారు. దీని ప్రకారం జిల్లాలో ఐదుగురు, ఆపైన వ్యక్తులు ఒకేచోట గుమిగూడరాదని తెలిపారు. అలాగే శాంతియుత వాతావరణానికి, ప్రశాంత పౌర జీవనానికి భంగం కలిగించే సమావేశాలు, ధర్నాలు చేయరాదని, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉపన్యసించరాదని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఎలక్ట్రానిక్‌ ఛానల్స్‌ ద్వారా నిరసన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను నిషేధించారు. నిషేధాజ్ఞల కాలంలో సెల్‌ఫో¯ŒS, ఇంటర్నెట్‌ సేవలు, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేయాలని మొబైల్‌ నెట్‌వర్క్‌ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించారు. జిల్లా ప్రజలు ఈ ఉత్తర్వులను పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో అధికార, పోలీసు యంత్రాగాలకు అన్నివిధాలా సహకరించాలని కలెక్టర్‌ కోరారు.
   
  ముద్రగడ కదలికలపై నిఘా
  నేడు కిర్లంపూడి రానున్న పోలీసు బలగాలు
  జగ్గంపేట : కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. కాకినాడలో ఆదివారం జరిగిన కాపు జేఏసీ సమావేశానికి వెళ్లిన ముద్రగడను పోలీసులు వెంబడించినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. కాపులకు రిజర్వేషన్లను సాధించేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ఉద్యమబాట పట్టిన ఆయనను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు. యాత్రకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో కిర్లంపూడిలోని ఆయన నివాసం ముందు మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి పోలీసు సిబ్బందిని కిర్లంపూడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో ఉన్న కల్యాణ మండపాన్ని సిబ్బంది కోసం సిద్ధం చేశారు. ముద్రగడ యాత్ర ప్రకటన నేపథ్యంలో గత నవంబరులో సుమారు 6 వేల మంది పోలీసులు వివిధ జిల్లాల నుంచి బందోబస్తు కోసం జిల్లాకు వచ్చారు. ఈసారి కూడా అదే స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. ముద్రగడ యాత్ర నేపథ్యంలో కిర్లంపూడికి పోలీసు బలగాలు వస్తున్నాయని జగ్గంపేట సీఐ కాశీ విశ్వనాథం చెప్పారు. అయితే ఎంతమంది వస్తారనేది ఇంకా చెప్పలేమన్నారు.
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు