‘ఆ అర్హత మంత్రి గంటాకు లేదు’

9 Aug, 2016 04:01 IST|Sakshi
‘ఆ అర్హత మంత్రి గంటాకు లేదు’
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని విమర్శించే  అర్హత మంత్రి గంటా శ్రీనివాసరావుకు లేదని కాపు జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, నాయకుడు నల్లా విష్ణు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యమం సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ముద్రగడకు ఇచ్చిన గడువు ఆగస్టు నెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో, ముఖ్యమం త్రికి లేఖ రాసినట్టు వివరించారు. ముద్రగడపై గంటా వ్యంగంగా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్రీడల్లో పాల్గొనేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉంటే, పద్మనాభం కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముద్రగడ రాజకీయ నిరుద్యో గి అని గంటా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో మంత్రి పదవికి, డ్రెయినేజీ బోర్డు చైర్మన్‌ పదవికి ముద్రగడ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో గంటా శ్రీనివాసరావుపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికైనా స్పందిం చాలని డిమాండ్‌ చేశారు. నాయకులు ఆకుల రామకృష్ణ, అల్లూరి శేషునారాయణ, మానే దొరబాబు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు