'ఆ నివేదిక తర్వాతే కాపు రిజర్వేషన్ల అంశం'

24 Feb, 2016 13:02 IST|Sakshi

పశ్చిమ గోదావరి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రేపు (గురువారం) కాపు రుణమేళా నిర్వహిస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 25వేల మందికి 192 కోట్ల రూపాయల రుణాలు అందజేస్తామని చెప్పారు. బుధవారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడారు.

మంజునాధ నివేదిక తర్వాతే కేంద్రం దృష్టికి కాపుల రిజర్వేషన్ల అంశం తీసుకెళ్తామని అన్నారు. కాపు కార్పొరేషన్ లబ్దిదారులను జన్మభూమి కమిటీలే ఎంపిక చేస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

>
మరిన్ని వార్తలు