తొలగిన ఆంక్షలు

25 Jan, 2017 23:50 IST|Sakshi
తొలగిన ఆంక్షలు
 
  • గృహ నిర్బంధాల ఎత్తివేత
  • విశాఖ తీరానికి బలగాల తరలింపు
  • జిల్లాలో పలుచోట్ల నిరసనలు.. బంద్‌లు
 
అమలాపురం టౌన్, జగ్గంపేట :
 కాపు నేతలపై గృహ నిర్బంధ ఆంక్షలను ఎట్టకేలకు ఎత్తివేశారు. విశాఖ తీరంలో గురువారం జరగనున్న ప్రత్యేక హోదా నిరసన సభను అణిచివేసేందుకు ఇక్కడి పోలీసు బలగాలను విశాఖకు తరలించారు. కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద మాత్రం గృహ నిర్బంధం, పోలీసు బందోబస్తును పాక్షికంగా తొలుత సడలించి రాత్రి ఏడు గంటల తరువాత పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. కోనసీమలోని అమలాపురంతోపాటు మండల కేంద్రాల్లోని కాపు నేతలను గృహ నిర్బంధాల నుంచి విముక్తి చేసి ఆ ఇళ్ల వద్ద ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరించారు. అమలాపురంలో కాపు రిజర్వేష¯Œ¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ జాయింట్‌ కన్వీనర్లు కల్వకొలను తాతాజీ, నల్లా పవ¯ŒSSకుమార్‌ల ఇళ్ల వద్ద ఉన్న పోలీసు పికెట్లను ఉపసంహరించారు.  రావులపాలెం మండలం గోపాలపురంలో రాష్ట్ర  కాపు జేఏసీ కన్వీనర్లు ఆకుల రామకృష్ణ, కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేటలో వాసిరెడ్డి ఏసుదాసు గృహ నిర్బంధాన్ని ఎత్తివేశారు.
బంద్‌లు.. నిరసనల హోరు
ఉదయం నుంచి కాపు నేతల గృహ నిర్బంధాలు కొనసాగుతుండగా బుధవారం సాయంత్రం వరకూ జిల్లాలో పలుచోట్ల కాపుల ఆధ్వర్యంలో బంద్‌లు.. నిరసనలు కొనసాగాయి. కిర్లంపూడిలో బుధవారం తలపెట్టిన బంద్‌ విజయవంతమైంది. రావులపాలెం మండలం గోపాలపురంలో కాపులు చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా జరిగింది. కాపులను బీసీల్లో చేర్చటంలో కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రావులపాలెం బంద్‌ పాక్షికంగా సాగింది. అమలాపురంలో గాంధీనగర్‌ వద్ద కాపు మహిళలు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అమలాపురంలో కాపు ఉద్యమ నేత కల్వకొలను తాతాజీ గృహ నిర్బంధంలో ఉండగా ఆ ప్రాంతానికి చెందిన మహిళలు తరలివచ్చి అక్రమ గృహ నిర్బంధాలను నిరసిస్తూ నినాదాలు చేసి వారికి మద్దతు తెలిపారు. సాయంత్రం నుంచి గృహ నిర్బంధాలు ఎత్తివేత అనంతరం కాపు ఉద్యమ నేతలు నల్లా విష్ణుమూర్తి, నల్లా పవన్‌ కుమార్‌లు ఊరేగింపుగా గండువీధికి వెళ్లి అక్కడ ఉన్న కాపు ఉద్యమ నేత దివంగత నల్లా సూర్య చంద్రరావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి కాపుల ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వ తీరును తూర్పారబెట్టారు. కాపులు తమ నోళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీతో పాటు పీసీసీ కార్యదర్శులు పాల్గొని కాపుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇక అంబాజీపేట, పి.గన్నవరం తదితర ప్రాంతాల్లో కూడా కాపులు నిరసనలు తెలిపారు.
 
మరిన్ని వార్తలు