కరికాళ చోళుడు

26 Oct, 2016 21:53 IST|Sakshi
కాంస్య విగ్రహ శైలిలో రూపొందించిన కరికాళ చోళుడు చిత్రం
  ఉత్తమ కళాఖండంగా ఎంపిక 
 
నంద్యాల:  స్థానిక చిత్రకారుడు చింతలపల్లె కోటేష్‌ రూపొందించిన కరికాళ చోళుడు చిత్రం ఉత్తమ కళా చిత్రంగా ఎంపికైంది. నెల్లూరులోని అమీర్‌ ఫైన్‌ ఆర్ట్‌ అకాడమీ జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళ పోటీల్లో ఆయన చోళుడు చిత్రాన్ని కాంస్య విగ్రహ శైలిలో సజీవంగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని కాన్వాస్‌పై నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పులో తైల వర్ణంలో నెలరోజులు శ్రమించి తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఉత్తమ కళాఖండంగా ఎంపిక కావడంపై ప్రముఖ చిత్రకారుడు చందా రామయ్య, రాంప్రసాద్‌ అభినందించారు. నవంబర్‌ 20న నెల్లూరు టౌన్‌హాల్‌లో అవార్డును అందజేస్తారని కోటేష్‌ తెలిపారు. 
 
>
మరిన్ని వార్తలు