కరీంనగర్‌లో కరాటే అకాడమీ ఏర్పాటుపై దృష్టి

28 Jul, 2016 23:37 IST|Sakshi
 
  • ఐబీకేవో అధ్యక్షుడు, సినీ నటుడు సుమన్‌ 
కరీంనగర్‌ స్పోర్ట్స్‌ : కరాటేలో కరీంనగర్‌ జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని సినీనటుడు, ఐబీకేవో అధ్యక్షుడు సుమన్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌కు వచ్చిన ఆయన ఆగస్టులో ఇండోనేషియాలో జరుగనున్న ఇంటర్నేషనల్‌ కరాటే పోటీల్లో పాల్గొనే భారత జట్టు జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే ఎంతో కృషి, పట్టుదల అవసరమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులపై తాను దృష్టి పెట్టానని, వారి భవిష్య™Œ పై ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. నేటికాలంలో ఆత్మసై్థర్యానికి, ఆత్మరక్షణకు, ఫిట్‌నెస్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌ను నేర్చుకోవాలని అందరూ అంటున్నారే కాని అందులో రాణించిన వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. భవిష్యత్‌లో కరీంనగర్‌లో జాతీయ కరాటే అకాడమీని నెలకొల్పడానికి కృషి చేస్తానన్నారు. కాంటినెంటల్‌ బూడోకాన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ అకాడమీ స్థాపించినప్పటి నుంచి 13 అంతర్జాతీయ పోటీల్లో సుమారు 24 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారని వివరించారు. 
ఎంపికైన క్రీడాకారులు వీరే.. 
ఆగస్టు 24 నుంచి 27 వరకు ఇండోనేషియాలోని తన్‌జంగ్‌పింగాలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనే భారత జట్టు జాబితాను సుమన్‌ ప్రకటించారు. జట్టులో జిల్లాకు చెందిన ఇ.అంజన, ఎస్‌.శృతి, జి.శ్వేత, కె.పావని, ఈ.ఓంకార్‌ జయస్వరూప్‌ ఉన్నారు. ఇ.శ్రీనివాస్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సుమన్‌ సత్కరించారు. 
 
మరిన్ని వార్తలు