పోలీసుల అదుపులో 'బీటెక్ బాబు'?

21 Oct, 2015 10:10 IST|Sakshi
పోలీసుల అదుపులో 'బీటెక్ బాబు'?

ద్విచక్రవాహనాలను చోరీ చేసి కుప్పంలో విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. తీగ లాగేసరికి డొంకంతా కదిలింది. అతడిని విచారణ చేసి ఇప్పటి వరకు 42 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ వాహనాలు కొనుగోలు చేసిన వారిలో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నాయకుల పుత్రరత్నాలు ఉన్నట్టు భోగట్టా! దీంతో ఒత్తిళ్లు అధికం కావడంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ఇదెన్ని మలుపులు తిరుగుతుందోనని పట్టణవాసుల్లో చర్చనీయాంశమైంది.
 
 కుప్పం: బెంగళూరు, కేజీఎఫ్, కోలారు, క్రిష్ణగిరి తదితర పట్టణాల్లో ద్విచక్రవాహనాలను చోరీ చేసి కుప్పంలో విక్రయిస్తున్న ఓ యువకుడిని నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అతడి నుంచి 42 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని, వురింత సవూచారం కోసం విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలన్నీ కొత్తవే కావడం విశేషం. రిజిస్ట్రేషన్ కాని కొత్త మోటార్ సైకిళ్లను చోరీ చేసి ఓ వుుఠా కుప్పంలో విక్రయిస్తున్నట్టు పోలీసులకు సవూచారం అందడంతో నిఘా పెట్టారు.
 
 దీంతో వుండల పరిధిలోని ఎలాంజగానూరుకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా బీటెక్ పూర్తి చేసి దొంగావతారమెత్తిన అతని నుంచి రాబట్టిన సమాచారంతో ఇప్పటి వరకు 42 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అతడు జల్సాల కోసం బైకుల చోరీకి పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా తేలింది. అయితే, అతనితోపాటు ఎంతమంది చోరీలో పాల్గొన్నారనేది తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా పెద్దమొత్తంలో మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం, పైగా చోరీ చేసి, విక్రయించిన బైకుల్లో బుల్లెట్ బైక్స్‌ను అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల కుమారుల నుంచి రికవరీ చేయడంతో పట్టణంలో తీవ్ర చర్చనీయూంశంగా వూరింది.
 
 చోరికి చేసిన వాటిల్లో బుల్లెట్‌తోపాటు పల్సర్ వాహనాలే అధికంగా ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఇవన్నీ ఉన్నాయి. ఇంకనూ స్వాధీనం చేసుకోవలసిన మోటార్ సైకిళ్లు ఉన్నట్టు సమాచారం. ఓ వైపు- పోలీసులు ఘరానా బైక్ దొంగను పట్టుకున్నారని స్థానికుల నుంచి ప్రశంసలు అందుతున్నా, మరోవైపు ‘అధికార పార్టీ నేతల’ ఒత్తిళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నట్టు తెలిసింది.మొత్తానికి బుల్లెట్ స్టార్ట్ అయ్యింది. కేసు, దర్యాప్తు పరంగా ఇది పోలీసులను ఎట్లా పరుగులు తీయిస్తుందో వేచి చూడాలని స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు