కవిత.. భాభారత మహిళా క్రికెట్‌కు భవిత

5 Sep, 2017 22:10 IST|Sakshi
కవిత.. భాభారత మహిళా క్రికెట్‌కు భవిత
క్రికెట్‌లో జాతీయ స్థాయిలో రాణిస్తున్న కవిత
 జాతీయ పోటీల్లో బంగారు పతకం కైవసం
ఇండియా టీమ్‌లో ఆడడమే లక్ష్యం
బెస్ట్‌ రన్స్‌ 176
దేవరపల్లి: మహిళా క్రికెట్‌ళక్ష దుమ్ము రేపుతోంది చింతపల్లి కవిత. దేవరపల్లి బీసీ కాలనీలో ఓ సామాన్య, మధ్యతరగతి కుటుంబానికి చెందిన క్రీడాకారణి చింతపల్లి కవిత. మహిళా క్రికెట్‌లో అనేక విజయాలు సాధిస్తూ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి ఏడాదికి రూ.48,000 ఉపకార వేతనం అందుకుంటోంది. జోనల్‌ టోర్నమెంట్‌లో 176 పరుగులు తీసి క్రికెట్‌ ప్రేమికుల మన్ననలు పొందింది. ఇంత వరకు 10 రాష్ట్రస్థాయి పోటీల్లోనూ, 4 జాతీయ స్థాయి టోర్నమెంట్స్‌లోనూ ఆడి విజయాలు సొంతం చేసుకుంది కవిత. 201314లో మహరాష్ట్రలో జరిగిన టోర్నమెంట్‌లో రాష్ట్రం తరఫున అండర్‌19 విభాగంలో కవిత జాతీయస్థాయిలో జరిగిన పోటీలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది.   201415లో జార్కండ్‌లో జరిగిన జాతీయ టోర్నమెంట్‌లో ఆడి తృతీయస్థానంలో కవిత నిలిచింది. వీటిలో పాటు రాష్ట్రస్థాయిలో అనేక టోర్నమెంట్లలో విజయాలు సాధించింది. కవిత మాట్లాడుతూ రాష్ట్ర జట్టులో గల క్రీడాకారులందరూ దేవరపల్లి, దుద్దుకూరు గ్రామాలకు చెందిన వారేనని తెలిపారు.  తామంతా కష్టపడి విజయాలు సాధిస్తున్నామన్నారు. స్థానిక అంబటి సత్యనారాయణరావు జెడ్పీ హైస్కూల్‌ క్రీడా ప్రాంగణంలో  కోచ్‌ రమాదేవి శిక్షణ ఇస్తూ  ఆటలో మెలకువలను వివరిస్తున్నారని కవిత పేర్కొంది. పీడీ కేవీడీవీ ప్రసాద్‌ తమ ఆటను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. అలాగే భూపతిరాజు విద్యా సంస్థ చైర్మన్‌ డి.సువర్ణరాజు తమకు సహకరిస్తున్నారన్నారు. మరింత కష్టపడి ఇండియా తరఫున మహిళా క్రికెట్‌లో ఆడాలనేదే తన లక్ష్యమని కవిత తెలిపింది.
 
 
మరిన్ని వార్తలు