యువతిని రక్షించిన కాజీపేట పోలీసులు

8 Sep, 2016 00:28 IST|Sakshi
కాజీపేట : గొంతుకోసుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న యువతిని కాజీపేట పోలీసులు గుర్తించి సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడా రు.  స్థానిక సీఐ రమేష్‌కుమార్‌ కథనం ప్రకారం... మంగళవారం రాత్రి వినాయక చవితి ఉత్సవ నిర్వాహక మండళ్లను తని ఖీ చేస్తున్న పోలీసు బృందం కడిపికొండ క్రాస్‌ రోడ్డులోని కాలనీల్లో పర్యటించి వ స్తుండగా ఓ యువతి చెట్లపొదల మధ్య పడిపోయి కన్పించింది. మృతదేహమై ఉండొచ్చనే అనుమానంతో దగ్గరకు వెళ్లిన బ్లూకోట్‌ పోలీ సులు ఆ యువతి ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్సై భీమేష్‌కు సమాచారమిచ్చారు. ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని తన వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రెండున్నర గంట లపాటు ఆపరేషన్‌ చేసిన వైద్యులు యువతికి ప్రాణాపాయంలేదని ప్రకటించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలంలో వెదకగా ఆ యువతి రాసిన సూ సైడ్‌ నోట్‌ లభించిందని, దానిని పరిశీ లించగా నల్లగొండ జిల్లా నూతనకల్‌ మండలం బిక్కుమళ్ల గ్రామానికి చెంది న మంజుల(17)గా వెల్లడైంది. మరిపెడలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్‌ చదువుతున్న మంజుల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలో చికిత్స పోందుతోంది. తర చూ తలనొప్పి, గొంతు, విని కిడి సమస్యలు వేధిస్తుండటంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించిన ట్లు కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీ సులు వెల్లడించారు. ప్రాణాపాయస్థితిలోఉన్న యువతిని ఆస్పత్రిలో చేర్పించి కాపాడిన ఎస్సై భీమేష్, కాని స్టేబుల్‌ రామారావును సీఐ అభినందించారు. వారికి రివార్డు ఇప్పించ డానికి సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు.  
మరిన్ని వార్తలు