అభినవ భగీరథుడు కేసీఆర్

9 Mar, 2016 03:45 IST|Sakshi
అభినవ భగీరథుడు కేసీఆర్

దుబ్బాక : తెలంగాణ, మహారాష్ట్రాల జల ఒప్పందం చరిత్రాత్మకమని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అభినవ భగీరథుడు సీఎం కేసీఆర్ అని  ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత మగాణులు సస్యశ్యామలంగా కనిపించేలా కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గోదావరి నదిపై ఐదు బ్యారేజీలను నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ చేసిన ఒప్పందం చరిత్రాత్మకమన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం ఒక విజయమైతే, గోదావరి నది జలాలను తెలంగాణ ప్రాంతానికి తీసుకురావడం మరో విజయమన్నారు.  హరిత తెలంగాణ కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ ర్యాకం పద్మశ్రీరాములు, జడ్పీటీసీ ఏల్పుల గౌతమి మహేశ్, టీఆర్‌ఎస్ నాయకులు గుండవెళ్లి ఎల్లారెడ్డి, ఆస స్వామి, బండి రాజు, కొట్టె ఇందిర, గన్నె భూంరెడ్డి, అమ్మన మహిపాల్‌రెడ్డి, తౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 టపాసులు కాల్చిన కార్యకర్తలు
సిద్దిపేట: తెలంగాణ, మహారాష్ర్ట మధ్య గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణాకి మంగళవారం అంతరాష్ట్ర జల ఒప్పందం జరగడం పట్ల స్థానిక మంత్రి హరీశ్‌రావు ఇంట్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందాలపై సంతకాలు చేసిన వెంటనే మంత్రి ఇంట్లో టపాసులు పేల్చి , మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు బర్ల మల్లికార్జున్, మిద్దె రవి, మంత్రి వ్యక్తిగత సహాయకుడు రాంచందర్‌రావు  తదితరులు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో తిరుపతి, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు