పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

30 Jul, 2016 18:49 IST|Sakshi
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

కేశవగూడ గ్రామాన్ని సందర్శించిన జిల్లా మలేరియాధికారి సంతోష్‌

షాబాద్: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా మలేరియాధికారి సంతోష్‌ పేర్కొన్నారు. మండలంలోని కేశవగూడ గామాన్ని శనివారం ఆయన సందర్శించారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.   గ్రామంలో నీటినిల్వ ఉన్న ప్రదేశాలను  పరిశీలించారు. గ్రామంలో తాగు నీటి సరఫరాలో క్లోరినేషన్ చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రజలు నీటిని కాచి వడ బోసుకుని తాగాలని చెప్పారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమల బెడద లేకుండా ఆప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలోని మురుగుకాల్వలను, నీటి తొట్లను, సంపులను, వాటర్ ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేశారు. ఆయన వెంట షాబాద్‌ డాక్టర్ కరిమున్నీసా, సీహెచ్‌ఓ గోపాల్‌రెడ్డి, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు