రెజ్లింగ్‌లో కేజీబీవీ విద్యార్థినుల సత్తా

15 Sep, 2016 23:50 IST|Sakshi
రెజ్లింగ్‌లో కేజీబీవీ విద్యార్థినుల సత్తా
  •  జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపిక
  • కలిగిరి : కలిగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో జరిగిన రెజ్లింగ్‌(కుస్తీ) పోటీల్లో సత్తాచాటారు. స్థానిక కేజీబీవీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు గురువారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఈటీ కే.కిరణ్మయి మాట్లాడుతూ విజయవాడ సమీపంలోని పేళ్లప్రోలులో ఈ నెల 12 నుంచి 14 వరకు రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలు జరిగాయని, 66 కేజీల విభాగంలో పి.అన్విత, 43 కేజీల విభాగంలో ఎస్‌కే తస్లీమ ప్రథమ స్థానంలో, 38 కేజీల విభాగంలో ఎన్‌సుజిత ద్వితీయ స్థానంలో, 49 కేజీల విభాగంలో ఆర్‌.వెంగమ్మ తతీయ స్థానంలో నిలిచారని తెలిపారు. నవంబర్‌లో పుణేలో నిర్వహించే జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొనడానికి పి.అన్విత, ఎస్‌కే.తస్లీమ ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు