ఖమ్మం ‘కట్‌’!

6 Sep, 2016 23:37 IST|Sakshi
కలెక్టరేట్‌
  • రెండుగా చీలుతున్న జిల్లా
  •  63 ఏళ్ల క్రితం ఆవిర్భావం
  •  కలెక్టరేట్‌కు 1959లో భూమిపూజ
  •  పాలనా కేంద్రానికి 57 ఏళ్లు పూర్తి
  •  47 మంది కలెక్టర్లు.. 34 మంది జేసీలు
  •  జిల్లాకు తొలి కలెక్టర్‌ భట్‌.. చివరి కలెక్టర్‌ లోకేశ్‌

  • ఎంతో చరిత్ర కలిగిన ఖమ్మం జిల్లా ఆవిర్భవించి 63 ఏళ్లు. ఒకప్పుడు వరంగల్‌ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ జిల్లా కలెక్టరేట్‌కు 1959లో భూమిపూజ జరిగింది. ఉద్యమాల ఖిల్లాగా పేరెన్నికగన్న జిల్లాను పరిపాలన సౌలభ్యం కోసం త్వరలో రెండుగా చీల్చనున్నారు. ప్రస్తుతం జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కొత్తగూడెం కేంద్రంగా  నూతన జిల్లా ఆవిర్భవించనుంది. ఇప్పటి వరకు 47 మంది కలెక్టర్లు, 34 మంది జేసీలు జిల్లాలో విధులు నిర్వహించారు.


    ఖమ్మం జెడ్పీసెంటర్‌:
        స్వాతంత్య్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఎంతో చరిత్ర కలిగిన ఖమ్మం జిల్లా 63 ఏళ్ల తర్వాత రెండు ముక్కలు కాబోతుంది. ఉమ్మడిగా ఉన్న జిల్లాను విభజిస్తూ కొత్తగూడెం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. 1953 అక్టోబర్‌ 1న జిల్లా ఆవిర్భవించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 193 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా అపార ఖనిజ నిక్షేపాలు, భిన్న సంస్కృతులకు నిలయంగా ఉంది. పునర్విభజనతో జిల్లా పూర్వ వైభవాన్ని కోల్పోనుంది. జిల్లాలో 47 మంది కలెక్టర్లు, 34 మంది జాయింట్‌ కలెక్టర్లు విధులు నిర్వహించారు.
    ఖమ్మం జిల్లా చరిత్ర
    1953 అక్టోబర్‌ 1న ఖమ్మం జిల్లా ఏర్పడిన తరువాత 1959 జనవరి 8న అప్పటి గవర్నర్‌ భీమ్‌సేన్‌సచార్‌ ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. జిల్లా తొలి కలెక్టర్‌గా జీవీ భట్‌ పనిచేశారు. తొలుత కలెక్టర్‌ కార్యాలయం ప్రస్తుత మున్సిపల్‌ కార్యాలయంలో ఉండేది. తరువాత వైరా రోడ్డు ప్రధాన రహదారి పక్కకు మార్చారు. ప్రస్తుతం ఉన్న ఖమ్మం పేరు నరసింహాద్రి గుడి నుంచి వచ్చింది. నారసింహస్వామి ఆలయం ‘స్తంభ శిఖరి’ రాతి గుట్టపై ఉంది. రాతి శిఖరం కింద ఉన్న ఈ గుడిని ‘కంభ’ అనే పేరుతో పిలిచేవారు. కంభ అంటే స్తంభం అని అర్థం. ఖమ్మం అనే పేరు ‘కంభం మెట్టు’ నుంచి ‘ఖమ్మం మెట్టు’గా.. ప్రస్తుతం ఖమ్మంగా రూపాంతరం చెందింది. ఖమ్మం పట్టణం మున్నేరు పక్కనే ఉంది. మున్నేరు కృష్ణాకు ఉప నది.
    ఆవిర్భావం ఇలా..
    1953 అక్టోబర్‌ 18న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ తాలుకాలతో జిల్లాను ఏర్పాటు చేస్తూ 48/ఏవై/193/53 ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 1953 అక్టోబర్‌ 1కి పూర్వం ఖమ్మం జిల్లా ఏర్పడక ముందు వరంగల్‌ తాలూకాలో భాగంగా ఉండేది. వరంగల్‌ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం (అప్పట్లో ఖమ్మం మెట్టు), మధిర, పాల్వంచ, ఇల్లెందు, బూర్గంపాడు తాలూకాలను విడదీసి 1953 అక్టోబర్‌ 1న ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1956 నవంబర్‌ 1న హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత 1959లో తూర్పు గోదావరి జిల్లాలోని భద్రాచలం, నూగూరు వెంకటాపురం తాలూకాలను కూడా ఖమ్మం జిల్లాలో విలీనం చేశారు. అశ్వారావుపేట ప్రాంతాన్ని కూడా అదే ఏడాది జిల్లాలో కలిపారు. 1973లో మధిర, కొత్తగూడెం (అంతకు ముందు పాల్వంచ) తాలూకాల్లోని కొన్ని ప్రాంతాలను విడదీసి సత్తుపల్లి తాలూకాను ఏర్పాటు చేశారు. 1979లో ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం, బూర్గంపాడు తాలూకాల్లోని పలు ప్రాంతాలను విడదీసి తిరుమలాయపాలెం, సుదిమళ్ల, అశ్వారావుపేట, మణుగూరు తాలూకాలను ఏర్పాటు చేశారు. 1985లో తాలూకా వ్యవస్థ రదై్ధ మండలాల వ్యవస్థ ప్రారంభమయ్యాక జిల్లాను 46 మండలాలుగా విభజించారు. ప్రస్తుతం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో  పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ కనుమరుగు కానుంది. కొత్తగా వైరా రెవెన్యూ డివిజన్‌ ఆవిర్భవించనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జిల్లాలోని 5 మండలాలు పూర్తిగా, 2 మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యాయి. 41 మండలాలు జిల్లాలో ఉన్నాయి. పునర్విభజనతో జిల్లా రెండుగా చీలనుంది.
    జిల్లా కలెక్టర్లు వీరే..
    జిల్లా కలెక్టర్లుగా ఇప్పటి వరకు 47 మంది ఐఏఎస్‌లు పని చేశారు. జిల్లా తొలి కలెక్టర్‌గా జివి భట్‌ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి కలెక్టర్‌గా ఐ.శ్రీనివాసశ్రీనరేశ్‌ పని చేశారు. 47వ కలెక్టర్‌గా డీఎస్‌ లోకేష్‌కుమార్‌ పని చేస్తున్నారు. జిల్లా తొలి జాయింట్‌ కలెక్టర్‌గా 1985 నవంబర్‌1 లక్ష్మీపార్ధసారథి భాస్కర్‌ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో సురేంద్రమోహన్‌ జేసీగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో చివరి జేసీగా దేవరాజన్‌ దివ్య పని చేస్తున్నారు. చరిత్రలో ఇద్దరు మహిళా ఐఏఎస్‌ అధికారులు జిల్లా కలెక్టర్లుగా పనిచేశారు. వారిలో లక్ష్మీపార్ధసారథి భాస్కర్, ఉషారాణి ఉన్నారు.
    ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    సంఖ్య        పేరు                సంవత్సరం
    –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    1.         జీవీ భట్‌                01–11–1953–25–10–1956
    2.        ఎంఏ హమీద్‌            26–10–1956–  10–04–1957
    3.        ఆర్‌ఎస్‌ ప్రకాశ్‌రావు            11–04–1957–  01–05–1957    
    4.        జేఏ ధర్మరాజు            02–05–1957–  28–07–1958
    5.        పీసీ జేమ్స్‌            29–07–1958– 08–05–1959
    6.         సయ్యద్‌హసిమ్‌అలీ            18–05–1959– 23–05–1960
    7.         బీఎన్‌ జయసింహ            09–06–1960– 02–05–1961
    8.              కేవీ నటరాజన్‌            03–05–1961– 09–11–1961
    9.        వి.శ్రీనివాసచారి            10–11–1961– 25–04–1962
    10,        ఎం.అసదుల్లాసయ్యద్‌        26–04–1962– 21–09–1964
    11.         పీఎస్‌కృష్ణ                21–09–1964– 10–05–1967
    12.        అంజద్‌అలీఖాన్‌            28–06–1967– 21–09–1968
    13.        ప్రేమ్‌రాజ్‌మతుర్‌            02–12–1968– 07–06–1971
    14.        ఆర్‌.పార్ధసారథి            07–06–1971– 23–07–1972
    15.        గులాంజిలానీ            24–07–1972–  17–12–1973
    16.        ఆర్‌.పార్ధసారథి            19–12–1973– 14–09–1974
    17.         పీవీఆర్‌కే ప్రసాద్‌            18–09–1974–  19–05–1977
    18.         ఎస్‌.బెనర్జి                20–05–1977– 27–01–1979
    19.        డి.సుబ్బారావు            12–02–1979– 09–11–1979
    20.         కె.లక్ష్మీనారాయణ            10–11–1979–  15–09–1980
    21.        సి.వెంకటేశ్వరరావు            16–09–1980– 02–11–1981
    22.        వి.వేణుగోపాలరావు            21–12–1981– 08–08–1982
    23.         పీకే రస్తోగి                09–08–1982– 26–03–1985
    24.             ఆర్‌హెచ్‌.క్వాజా            27–03–1985–  28–04–1987
    25.        ఐ.వైఆర్‌.కృష్ణారావు            29–04–1987–  19–04–1989
    26.        వి.శర్మరావు            23–04–1989,  17–01–1990
    27.                     ఎస్‌కె.సిన్హా            18–01–1990– 06–01–1991
    28.        పి.సుబ్రమణ్యం            07–01–1991–  31–03–1991
    29.         లక్ష్మీపార్ధసారథి భాస్కర్‌        06–04–1991– 27–08–1993
    30.        ఏపీ సహనీ            28–08–1993–  22–04–1995
    31.             ఎన్‌.నర్సింహారావు            24–04–1995–04–12–1996
    32.        నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌        05–12–1996–21–04–1998
    33.        ఎండీ అలీరఫత్‌            22–04–1998–19–06–1998
    34.        ఏ.గిరిధర్‌                20–06–1998–11–07–2002
    35.        అరవింద్‌కుమార్‌            13–07–2002- 20–09–2004    
    36.         రాజేంద్రనరేంద్ర నిమ్జే            20–09–2004–17–05–2006
    37.        సాల్మన్‌ఆరోఖ్యరాజ్‌            18–05–2006– 19–05–2006
    38.        శశిభూషణ్‌కుమార్‌            20–05–2006– 12–02–2009
    39.        వి.ఉషారాణి            14–02–2009–05–04–2010
    40.        ఎన్‌.నాగేశ్వరరావు            08–04–2010–31–03–2011
    41.        మహ్మద్‌అబ్దుల్‌ అజీం        01–04–2011–08–04–2011
    42.        సిద్దార్థజైన్‌                09–04–2011– 23–06–2013
    43.        ఐ.శ్రీనరేష్‌                24–06–2013– 31–07–2014
    44.        కె.ఇలంబరితి            01–08–2014– 31–08–2015
    45.        డీఎస్‌ లోకేష్‌కుమార్‌    31–08–2015– 27–04–2016
    46.         ఎం.దానకిశోర్‌            27–04–2016–    22–05–2016
    47.         డీఎస్‌ లోకేష్‌కుమార్‌     23–05–2016    

     

మరిన్ని వార్తలు