ఆగ్రాలో రోడ్డు ప్రమాదం.. పాల్వంచ విద్యార్థి దుర్మరణం

20 May, 2016 01:22 IST|Sakshi
ఆగ్రాలో రోడ్డు ప్రమాదం.. పాల్వంచ విద్యార్థి దుర్మరణం

పాల్వంచ రూరల్: ఆగ్రాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఒడ్డుగూడేనికి చెందిన ఎస్‌కె.ఖాదర్ (23)  దుర్మరణం చెందాడు. అక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ సెకండియర్ చదువుతున్న అతడు ఫోన్ రీచార్జ్ చేయించుకునేందుకు తన క్యాంపస్ నుంచి స్నేహితుడితో కలసి బయటకు వచ్చాడు. రాజ్‌కామండీ ఎంజీరోడ్ మీదుగా వెళ్తుండగా వేగంగా వచ్చి న భారీ వాహనం ఖాదర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ విషయాన్ని స్నేహితుడు పాల్వంచలోని అతడి తమ్ముడు అల్లాబక్షికి ఫోన్ చేసి తెలిపాడు. మృతదేహాన్ని తీసుకొచ్చే ఆర్థిక స్తోమత కూడా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తి మేరకు కలెక్టర్ ఆగ్రాలోని యూనివర్సిటీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఖాదర్ మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శుక్రవారం పాల్వంచకు చేర్చేవిధంగా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు