కీచక ఉపాధ్యాయుడి అరెస్టు

4 Sep, 2016 23:24 IST|Sakshi
కీచక ఉపాధ్యాయుడి అరెస్టు
  • ∙విద్యార్థినిని బలవంతంగా పెళ్లాడి, అత్యాచారానికి పాల్పడిన టీచర్‌
  • ∙రిమాండ్‌కు తరలింపు 
  • భూపాలపల్లి : విద్యార్థినికి ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి బలవంతంగా వివాహం చేసుకొని అత్యాచారానికి పాల్పడిన ఓ ఉపాధ్యాయుడిని అరెస్ట్‌ చేసినట్లు పరకాల డీఎస్పీ సుధీంద్ర తెలిపారు. భూపాలపల్లి పోలీస్‌స్టేçÙన్‌లో ఆదివారం సదరు ఉపాధ్యాయుడి అరెస్టు చూపిన అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది మండలంలోని ఆజంనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన ఓ విద్యార్థినితో, అదే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసే ఎండీ రఫీ చనువు పెంచుకున్నాడు. విద్యార్థినికి సెల్‌ఫోన్‌ కొనిచ్చి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఆమెను ఈ ఏడాది జూన్‌ 16న వెంకటాపురం మండలంలోని ఓ సంక్షేమ వసతి గృహంలో చేర్పించారు. కాగా ఇటీవల రాఖీ పండుగ కోసం ఆమె ఆజంనగర్‌కు వచ్చింది. తిరిగి వసతి గృహానికి వెళ్తున్న క్రమంలో రఫీ ఆమెను కలిశాడు. స్థానిక సింధూరి హోటల్‌ ఎదుటనున్న వెంచర్లలోని ఖాళీ గదిలోకి విద్యార్థినిని తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టాడు.
     
    అనంతరం పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వార్డెన్‌ బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఈ మేరకు ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రఫీపై ఐపీసీ 366, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. నిందితుడికి ఎవరెవరు సహకరించారనేది త్వరలోనే విచారణలో తేలుతుందని డీఎస్పీ సుధీంద్ర అన్నారు. ఆయన వెంట సీఐ సీహెచ్‌ రఘునందన్‌రావు, సిబ్బంది ఉన్నారు. 
మరిన్ని వార్తలు