ఎన్‌పీసీడీసీఎస్‌లోకి కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులు

12 Dec, 2016 15:14 IST|Sakshi
ఎన్‌పీసీడీసీఎస్‌లోకి కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులు
దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం
 కేన్సర్, డయాబెటిస్, బీపీల సరసన చేరుస్తూ నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: కేన్సర్, గుండె, షుగర్ వ్యాధుల జాతీయ నియంత్రణ, నిర్మూలన కార్యక్రమం (ఎన్‌పీసీడీసీఎస్)లో కిడ్నీ, శ్వాస కోశ సంబంధిత వ్యాధులనూ చేరుస్తూ తాజా గా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులనూ ఇకపై దీర్ఘకాలిక లేదా జీవనశైలి వ్యాధులుగా గుర్తిస్తారు. కేన్సర్, గుండె, షుగర్ వ్యాధులు ఎంత సర్వసాధారణ మయ్యాయో.. కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులూ అదే స్థారుులో జనాన్ని పట్టి పీడిస్తున్నారుు. ఈ వ్యాధులన్నింటినీ వివిధ పరీక్షల ద్వారా ముందుగానే గుర్తించి నియంత్రించడమే ఎన్‌పీసీడీసీఎస్ ప్రధాన లక్ష్యం. రెండేళ్ల క్రితం 3 ప్రధాన వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కోసం ఎన్‌పీసీడీసీఎస్ ఏర్పడగా.. తాజాగా కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులను చేర్చారు. 
 
 ఆరోగ్యశ్రీలో రెండో స్థానం కిడ్నీ వ్యాధులదే
 2015-16లో ఆరోగ్యశ్రీ కింద తెలంగాణలో చేసిన చికిత్సల్లో అత్యధికంగా 24.04 శాతం కేన్సర్‌కు సంబంధించినవే ఉన్నారుు. రెండో స్థానం కిడ్నీ వ్యాధులకు సంబంధించిన చికిత్సలదే. కిడ్నీ చికిత్సలు 17.80 శాతం, గుండె చికిత్సలు 10.92 శాతం ఉన్నారుు.  2015-16లో మొత్తం అన్ని రకాల వ్యాధులకు 2,60,110 చికిత్సలు జరిగితే అందులో కేన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులకు చెందిన చికిత్సలు 1,37,286 జరిగారుు. మరోవైపు అన్ని వ్యాధుల చికిత్సలకు కలిపి ప్రభుత్వం రూ. 682.99 కోట్లు కేటారుుస్తే.. అందులో రూ. 326.91 కోట్లు ఈ మూడింటికే ఖర్చు చేశారు. శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి 1,553 శస్త్రచికిత్సలు జరిగారుు. 
 
 ఎన్‌పీసీడీసీఎస్‌లో చేర్చితే ప్రయోజనమేంటి?
 దీర్ఘకాలిక వ్యాధులుగా కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులను గుర్తించి.. ఎన్‌పీసీడీసీఎస్‌లో చేర్చడం వల్ల ఆ వ్యాధుల నియంత్రణ, నిర్మూలనపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ముందస్తుగానే కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులను గుర్తించి మొదట్లోనే నయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రచించాలి. అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ యూనిట్లు పెంచడం, వైద్య నిపుణుల సంఖ్యను అధికం చేయడం.. ఊపిరితిత్తులకు సంబంధించి ప్రత్యేక వార్డులను జిల్లా, ఏరియా కేంద్రాల్లో ఏర్పాటు వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఎన్‌పీసీడీసీఎస్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చుతాయి.
మరిన్ని వార్తలు