ఆపన్నహస్తం అందించరూ..

16 Jul, 2016 22:41 IST|Sakshi
 కిడ్నీలు పాడైన నాలుగేళ్ల బాలుడు
 ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు
 
గుర్రంపోడు : నల్లగొండ జిల్లా  గుర్రం పోడు మండలంలోని చామలేడు గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు బద్రూ కిడ్నీలు చెడిపోవడంతో మంచానపడ్డాడు. గ్రామానికి చెందిన శిలువేరు నాగరాజు, సైదమ్మల మొదటి సంతానమైన బద్రూకు పుట్టిన ఆరు నెలలకే తీవ్ర అనారోగ్యం ఏర్పడటంతో డాక్టర్లకు చూపించగా కిడ్నీలు చెడిపోయినట్లు తేల్చారు. అప్పటి నుంచి వైద్యం చేయిస్తూనే ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాము ఇప్పటికే రూ.2 లక్షల ఖర్చు చేశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలం వైద్యసేవలు అందిస్తే కుమారుడు బతుకుతాడని వైద్యులు చెబుతున్నా మూడు నెలలుగా వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దాతలెవరైనా స్పందించి తమకు ఆర్థికసాయం అందించి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు.  
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు