క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై పరిజ్ఞానం అవసరం

14 Aug, 2016 00:07 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌బుయ్యా
 
తిరుపతి, గాంధీ రోడ్డు : సాంకేతిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై విద్యార్థులు పరిజ్ఞానం పెంచుకోవాలని ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌బుయ్యా తెలిపారు. శనివారం చంద్రగిరి మండలం రంగంపేటలోని  శ్రీవిద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌  కళాశాలలోని ఐటీ విభాగంలో టెక్విప్‌–2 సౌజన్యంతో ఒకరోజు రీసెర్చ్‌ ఓరియెంటెడ్‌ అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను  వివరించారు.  నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ శ్రీనివాసులురెడ్డి, చెన్నై అన్నా యూనివర్సిటీ ఐటీ ప్రొఫెసర్‌ తమరైసెల్వి మాట్లాడుతూ బిగ్‌డేటా ఎనలటిక్స్‌ ప్రాముఖ్యతను వివరించారు. అధ్యాపకులు గోపాలరావు, సుదర్శన్‌ కుమార్, భగవాన్, కష్ణమాచారి, టెక్విప్‌–2 కో–ఆర్డినేటర్‌ దామోదరం, రమణి పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల ఇంజనీరింగ్‌ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, పరిశ్రమల నుంచి వచ్చిన 123 మంది ఇంజనీర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు