తల్లిపాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి

3 Aug, 2016 01:50 IST|Sakshi
తల్లిపాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: తల్లిపాల ప్రాధాన్యతను ప్రజలందరు తెలుసుకోవాల్సిన అవసరముందని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జ్యోత్సS్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి ప్రారంభమైన తల్లిపాల వారోత్సవాలు ఈ నెల 6వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణిలు, బాలింతలు, కిశోరబాలికలు, ఏఎ¯Œæఎంలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి మహిళ ప్రసవించిన వెంటనే ముర్రుపాలు పట్టడం, 6 నెలల వరకు ముర్రు పాలు పట్టడం వంటి విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 3న స్కూళ్లలో కిశోరబాలికలకు తల్లిపాల ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 4న జిల్లా స్థాయిలో తల్లిపాలు, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వటం, ఆ తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించడం వంటి వాటిపై అవగాహన, 5న ప్రాజెక్టు స్థాయిలో అవగాహన, 6న వెల్‌బేబీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
మరిన్ని వార్తలు