చట్టాలపై అవగాహన అవసరం

27 Aug, 2016 22:37 IST|Sakshi
చట్టాలపై అవగాహన అవసరం

లీగల్‌ (కడప అర్బన్‌) :

చట్టాలపై పోలీసు అ«ధికారులతోపాటు ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి ఖచ్చితమైన అవగాహన ఉండాలని, మారుతున్న చట్టాలకు అనుగుణంగా తాము కూడా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణంలోని లోక్‌ అదాలత్‌ భవనంలో పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారులకు, ఎన్జీఓలకు నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఇటీవల కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని, తద్వారా మారుతున్న చట్టాలను మరింత ప్రజల్లోకి అవగాహన కోసం తీసుకు వెళుతున్నామన్నారు. ఇందులో భాగంగానే పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఎన్జీఓలు, స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులకు మరింత అవగాహన కల్పించే క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి యూయూ ప్రసాద్, జడ్జిలు అన్వర్‌బాష, శోభారాణి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జీవీ రాఘవరెడ్డి, కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు