కృష్ణా హ్యాండ్‌బాల్‌ మహిళల జట్టు ఎంపిక

12 Dec, 2016 14:41 IST|Sakshi
కృష్ణా హ్యాండ్‌బాల్‌ మహిళల జట్టు ఎంపిక

విజయవాడ (వన్‌టౌన్‌) : కృష్ణా విశ్వవిద్యాలయం హ్యాండ్‌బాల్‌ (మహిళలు) జట్టును ఎంపిక చేసినట్లు కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం తమ కళాశాలలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల (మహిళల) హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ ముగిసిన తరువాత ఎంపిక కమిటీ విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర లయోల కళాశాలకు చెందిన జె.సుశ్రీ, టి.నవ్య, ఎన్‌.మనీషా, కేబీఎన్‌ కళాశాలకు చెందిన టి.సాయివినీత, జి.సాయిలక్ష్మి, ఎస్‌.గౌరీపార్వతి, సిద్ధార్థ మహిళా కళాశాలకు చెందిన డి.తారాబాయి, ఎస్‌.దివ్యవల్లి, మారీస్‌ స్టెల్లా కళాశాలకు చెందిన కె.వంశీప్రియ, నూజివీడు ఎంఆర్‌ అప్పారావు పీజీ సెంటర్‌కు చెందిన ఈ.కల్యాణి, విజయ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కు చెందిన ఎం.కోటేశ్వరి, ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాలకు చెందిన పి.అశ్విని తదితులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. స్టాండ్‌బైస్‌గా పి.శివనాగలక్ష్మి (కేబీఎన్‌), కె.సుష్మాస్వరాజ్, జె.రాణి (ఆంధ్ర లయోల), ఎస్‌.శాంతి (మారీస్‌ స్టెల్లా), వీఎల్‌ భవ్య (సిద్ధార్థ మహిళా)ఎంపికైనట్లు వివరించారు. వీరు తమళనాడు సేలంలోని పెరియార్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి నిర్వహించే అంతర్‌ విశ్వవిద్యాలయ హ్యాండ్‌బాల్‌ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు