కేయూ ఎకనామిక్స్‌ విభాగాధిపతిగా సురేష్‌లాల్‌

4 Sep, 2016 00:47 IST|Sakshi
కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ ఎకనామిక్స్‌ విభాగం అధిపతిగా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బి.సురేష్‌లాల్‌ నియామకమయ్యారు. ఈమేరకు ఇన్‌చార్జి రిజి స్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.బెనర్జీ ఉత్తర్వులు జారీ చేయగా ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎకనామి క్స్‌ విభాగంలో ఇరవై ఏళ్లుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న సురేష్‌లాల్‌ కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ బా ధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇప్పటివరకు ఆయన రాసిన 76 పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం కాగా, పదహారు పుస్తకాలను రచించారు. ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ అవా ర్డు, అమెరికా అధ్యక్షుడు ప్రదానం చేసే లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డును ఆయన 2014లో అందుకున్నారు. కాగా, రెండేళ్ల పాటు ఆయ న ఎకనామిక్స్‌ విభాగాధిపతిగా కొనసాగనున్నారు.
 
అడ్మిషన్ల డైరెక్టర్, జేడీల కొనసాగింపు
కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్‌గా ఉన్న జువాలజీ విభాగం ప్రొఫెసర్‌ ఎం.కృష్ణారెడ్డిని కొనసాగిస్తూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జి.»ñ నర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, అడ్మిషన్ల జాయింట్‌ డైరెక్టర్లుగా ఉన్న జువాలజీ విభాగానికి చెందిన డాక్టర్‌ వై.వెంక య్య, ఫిజిక్స్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ లక్ష్మణ్‌ను కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. వీరి పదవీకాలం గత నెల 30న ముగియగా మళ్లీ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 
మరిన్ని వార్తలు