వీసీలుగా కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్లు

26 Jul, 2016 00:33 IST|Sakshi
తెలంగాణ యూనివర్సిటీకి  సాంబయ్య
అంబేద్కర్‌ ఓపెన్‌కు సీతారామారావు
జిల్లా నుంచి వీసీలుగా నియామకమైన ముగ్గురు ప్రొఫెసర్లు
 
కేయూ క్యాంపస్‌ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కాకతీయ యూనివర్సిటీ నుంచి ముగ్గురు ప్రొఫెసర్లకు వీసీలుగా అవకాశం కల్పించింది. ఇప్పటికే నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా కేయూ ఫిజిక్స్‌ విభాగం ప్రొఫెసర్‌ ఖాజా అల్తాఫ్‌హుస్సేన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పి. సాంబయ్యను, హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీగా రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె. సీతారామారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
1992లో కేయూలో సాంబయ్య నియామకం
వరంగల్‌ జిల్లా పరకాల మండలంలోని నాగారం గ్రామానికి చెందిన సాంబయ్య ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన కాకతీయ యూనివర్సిటీలోనే పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1984లో హన్మ కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. 1992లో కేయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకమయ్యారు. అలాగే యూనివర్సిటీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతిగా, బీఓఎస్‌గా, కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌గా, కేయూ అడ్మిషన్ల డైరెక్టర్‌గా పనిచేసి గత ఏడాది ఉద్యోగ విరమణ పొందారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సాంబయ్య సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా కూడా మెదిలారు. ఈ క్రమంలో వీసీల నియామకాల్లో సామాజిక వర్గాల సమీకరణలో ఎస్సీ మాదిగ నుంచి ప్రభుత్వం సాంబయ్యకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆయనను నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
సీతారామారావును వరించిన అవకాశం
హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె. సీతారామారావు నియామకమయ్యారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపెల్లికి చెందిన సీతారామారావు హన్మకొండలోని గోపాలపురంలో స్థిరపడ్డారు. ఆయన కేయూలోనే ఎంఏ, ఎం ఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1978–1987లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, 1987–1995లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా కేయూ లో పనిచేశారు. అనంతరం 1999 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. సీతారామారావు 2011లో కేయూ యూజీసీ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌గా, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సెస్‌ డైరెక్టర్‌గా, 2002లో ఎస్‌డీఎల్‌సీఈ జాయింట్‌ డైరెక్టర్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌గా, కేయూ లైబ్రరీ ఇన్‌చార్జిగా, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతితోపాటు పలు పదవులు చేపట్టారు. దివంగత ప్రొఫెసర్లు కొత్తపెల్లి జయశంకర్, బియ్యాల జనార్ధన్‌రావు, బుర్ర రాములుతో కలిసి పలు ప్రజాస్వామిక ఉద్యమాల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేయూ నుంచి కీలకపాత్ర పోషించారు. వీసీ నియామకం కోసం కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నంలో సీతారామారావు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మెుత్తంగా జిల్లా నుంచి ముగ్గురు ప్రొఫెసర్లకు వీసీలుగా బాధ్యతలు కట్టబెట్టారు. 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన రాంగోపాల్‌ వర్మ!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’