వలపట.. దాపట తెలిసే పార్టీలు మారుతున్నారా..?

21 Sep, 2017 09:25 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణారెడ్డి

ఎంపీ గుత్తాపై కుంభం కృష్ణారెడ్డి ఫైర్‌

నల్లగొండ టౌన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా గెలిసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిని విమర్శించే అర్హత లేదని ఆ పార్టీ కిసాన్‌సెల్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ కుంభం కృష్ణారెడ్డి అన్నారు. వలపట.. దాపట తెలిసే గుత్తా పార్టీలు మారుతున్నారా అని ప్రశ్నించారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ పదివిని ఆశిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని విమర్శిస్తే స్థాయి కాదని తెలు సుకోవాలన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో  గురువారం సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్‌హాల్‌లో రైతు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. సదస్సుకు రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా హాజరుకానున్నారన్నారని తెలిపారు. సమావేశంలో ఎస్సీసెల్‌ జిల్లా చైర్మన్‌ పెరిక వెంకటేశ్వర్లు, చింతమల్ల బాలక్రిష్ణ, శివాజీ, సందీప్, రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు