రోడ్డెక్కిన కుప్పం ‘పంచాయతీ’

1 Aug, 2016 23:29 IST|Sakshi
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న కుప్పం పంచాయితీ వార్డు సభ్యులు


– రాజీనామా పత్రాలు తీసుకోలేదని వార్డు సభ్యుల ధర్నా
– పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాÄýæుత్నం
– స్పందిచిన ఎంపీడీవో
– రాజీనామా పత్రాలు అందజేసిన 19 మంది వార్డుసభ్యులు
కుప్పం:
ఎంపీడీవో తమ రాజీనామా పత్రాలు తీసుకునేందుకు రావడం లేదని టీడీపీకి చెందిన కుప్పం పంచాయతీ వార్డు సభ్యులు సోమవారం ధర్నా చేశారు. ఓ సభ్యుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుప్పం పంచాయతీలో 20 మంది వార్డు సభ్యులున్నారు. వారిలో 18 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, ఇద్దరు వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ఉన్నారు. కుప్పం పట్టణంలో మూడేళ్లుగా అభివృద్ధి జరగలేదని వార్డు సభ్యులుగా తవుకు పట్టణంలో అవవూనంగా ఉందని భావించి టీడీపీకి చెందిన 14 మంది, వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు ఇద్దరు మొత్తం 16 మంది వార్డు సభ్యులు ఇటీవల కలెక్టర్‌కు, కడా ఎస్‌వోకు రాజీనామా పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా పత్రాలు స్థానిక ఎంపీడీవోకు అందజేసి ఆమోదం పొందాలని మూడు రోజులుగా వారు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన అందుబాటులో ఉండడం లేదు.  ఈ క్రవుంలో సోవువారం  ఉదయం మండల పరిషత్‌ కార్యాలÄýæుంలోని ఎంపీడీవో రామచంద్రకు రాజీనావూ పత్రాలను ఇచ్చేందుకు 19 వుంది వార్డు సభ్యులు కలిసి వచ్చారు. అప్పటికీ ఆయన అందుబాటులో లేరు. ఆగ్రహంతో వార్డు సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు.  గంట పాటు ధర్నా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో 20వ వార్డు సభ్యుడు వరదరాజులు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయారు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదేసవుయానికి అక్కడికి వచ్చిన ఎంపీపీ సాంబశివం సైతం తనకు ఏమీ తెలియనట్టు అక్కడ్నుంచి జారుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్వో ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఎంపీడీవో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వార్డు సభ్యులను బుజ్జగించి తన చాంబర్‌లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వాదోపవాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అనంతరం 19 వుంది వార్డు సభ్యుల ఎంపీడీవో రాజీనావూ పత్రాలను తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

మరిన్ని వార్తలు