అతివల రక్షణకు వాట్సాప్‌ 94932 06334

20 Jul, 2016 23:48 IST|Sakshi
అతివల రక్షణకు వాట్సాప్‌ 94932 06334
షీటీమ్‌లు, వాట్సాప్‌ నంబర్‌ ప్రారంభం ∙ 
త్వరలో 6వేల మంది పోలీసుల రిక్రూట్‌మెంట్‌ 
డీజీపీ జేవీ రాముడు
మధురపూడి : మహిళల రక్షణ, వారి సమస్యల పరిష్కారానికి గాను రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీసు అధికారులు రెండు షీ టీమ్‌లు, ఒక హెల్ప్‌ డెస్క్, వాట్సాప్‌ నంబర్‌ 94932 06334ను ఏర్పాటు చేశారు. వీటిని విశాఖపట్నం, కాకినాడ నుంచి మధురపూడి ఎయిర్‌పోర్టుకు వచ్చిన డీజీపీ జేవీ రాముడు బుధవారం ఆవిష్కరించారు. 
జెంట్‌ పోలీసులకు తమ సమస్యలు చెప్పుకోలేని మహిళలు షీటీమ్‌ను, వాట్సాప్‌ నంబర్‌ను ఆశ్రయించవచ్చని డీజీపీ సూచించారు. మహిళల భద్రత నిమిత్తం రెండు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతానికి ఏడుగురు మహిళా పోలీసులతో కూడిన రెండు మహిళా భద్రతాకమిటీలు, ఒక హెల్ప్‌డెస్క్‌ టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి టీమ్‌కు ఏఎస్సై బాధ్యురాలు కాగా, మరో ఆరుగురు మహిళా పోలీసులుంటారు.
త్వరలో ఆరు వేల మంది పోలీసుల రిక్రూట్‌మెంట్‌..
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం త్వరలో ఆరువేల మంది పోలీసులను రిక్రూట్‌మెంట్‌ చేసుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ జేవీరాముడు తెలిపారు. రాష్ట్రంలో పోలీసు అకాడమీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రశాంత వాతావరణం గల గోదావరి తీరప్రాంతంలో నేరాల నివారణ, మహిళల గొలుసు దొంగతనాల కమిటీలు అరికడతాయన్నారు. కార్యక్రమంలో అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, డీఎస్పీలు భరత్‌మాతాజీ, ప్రసన్నకుమార్, త్రినాథ్, ఎస్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు