మృగాళ్ల దాష్టీకం.. వైద్యుల నిర్లక్ష్యం

1 Nov, 2016 01:34 IST|Sakshi
మృగాళ్ల దాష్టీకం.. వైద్యుల నిర్లక్ష్యం
  •  బిడ్డకు జన్మనిచ్చి.. కడతేరిన పిచ్చి‘తల్లి’
  •  గడ్డ కట్టిన రక్తం ఎక్కించడంతో బాలింత మృతి
  •  కావలి ఏరియా వైద్యశాలలో ఘటన 
  •  
    కొండాపురం : మృగాళ్ల కామ దాహానికి ఆ పిచ్చి ‘తల్లి’ గర్భవతి అయింది. ఆమె గర్భిణి అని తెలుసుకునేలోగా.. తల్లి ప్రాణానికి ముప్పు అని తెలిసి మిన్నకుండిపోయారు. ఆ ‘తల్లి’ ప్రాణాలు కాపాడుకునేందుకు కాన్పు కోసం గత సోమవారం కావలి ఏరియా వైద్యశాలలో చేర్పించారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు నిర్లక్ష్యం వహించి.. ఆమెకు గడ్డ కట్టిన రక్తం ఎక్కించారు. తెలుసుకునేలాగో జరగరాని ఘోరం జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని పార్లపల్లి దళితవాడకు చెందిన బండ్లమూడి మాలకొండయ్య, నారాయణమ్మ కుమారై ఈశ్వరమ్మ (32) పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. 12 ఏళ్ల క్రితం పొట్టకూటì కోసం కుటుంబమంతా కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు పని నిమిత్తం వెళ్లారు. అక్కడ ఈశ్వరమ్మను కోటేశ్వరరావు అనే వ్యక్తి వివాహం చేసుకుంటానని మోసగించి గర్భవతిని చేశాడు. ఆమెకు దివ్యాంగుడైన మగబిడ్డను ప్రసవించింది. దీంతో కోటేశ్వరరావు ఈశ్వరమ్మను వదిలేశాడు. నాలుగేళ్ల క్రితం తిరిగి పార్లపల్లికి తల్లిదండ్రుతో వచ్చేసింది. ఈశ్వరమ్మను గుర్తుతెలియని కొందరు కామాంధులు గర్భవతిని చేశారు. ఈ క్రమంలో నిండు గర్భిణి అయిన ఈశ్వరమ్మను గత సోమవారం కాన్పు కోసం ఆమె తల్లి నారాయణమ్మ కావలి ఏరిమా వైద్యశాలకు తీసుకెళ్లింది. మూడు రోజుల క్రితం మగబిడ్డను ప్రసవించింది. తల్లి, బిడ్డ బాగానే ఉన్నారు. అయితే ఈశ్వరమ్మకు రక్తం తగ్గిందని, ఎక్కించాలని ఆదివారం సాయంత్రం ఒక నర్సు చెప్పిందని, వెంటనే తమ కుమారైకు రక్తం ఎక్కించారని నారాయణమ్మ తెలిపింది.  ఆ రక్తం గడ్డలు గడ్డలుగా ఉందని నర్సుకు చెప్పడంతో  బాటిల్‌ తీసివేసింది. అప్పటికే సగం బాటిల్‌ వరకు శరీరంలోకి వెళ్లింది. కొద్దిసేపటికి నర్సు వచ్చి మీ అమ్మాయి గుండెల్లో మట్టి చేరిందని, దీంతో చనిపోయిందని చెప్పారని వాపోయింది. రాత్రికి రాత్రే హాస్పిటల్‌ సిబ్బంది అంబులెన్స్‌ను పిలిపించి ఇంటికి పంపించారని తెలిపింది. విషయం తెలుసుకున్న కొండాపురం తహసీల్దార్‌ ప్రమీల, ఎస్‌ఐ రమేష్‌బాబు, ఏఎన్‌ఎం బుజ్జమ్మ అక్కడి చేరుకుని బిడ్డను, ఈశ్వరమ్మ మృతదేహన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్‌ఐ తెలిపారు.  
     
మరిన్ని వార్తలు