నిబంధనల ప్రకారం భూసేకరణ

1 Oct, 2016 01:23 IST|Sakshi
నిబంధనల ప్రకారం భూసేకరణ
  • ఇన్‌చార్జి కలెక్టర్‌ ఇంతియాజ్‌
  • నెల్లూరు(పొగతోట):
    విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి దగదర్తి మండలంలో భూసేకరణ వేగవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ మహమ్మద్‌ ఇంతియాజ్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడారు. సీజేఎఫ్‌ఎస్, పట్టా, అసైన్డ్, ప్రభుత్వ భూములకు సంబంధించి కేటగిరీ వారిగా పెండింగ్‌ లేకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కోర్టులో కేసులను పరిష్కరించి భూసేకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 150 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి రూ.17 కోట్ల నష్టపరిహారం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కావలి ఆర్‌డీఓ నరసింహన్, దగదర్తి తహసీల్దార్‌ వై. మధుసూదన్‌రావు పాల్గొన్నారు.
    సమాచారాన్ని అందజేయండి
    అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివిద శాఖలకు సంబంధించిన 235 ఇండికేటర్ల సమాచారాన్ని వెంటనే అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఇంతియాజ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 37 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 235 ఇండికేటర్లు ఉన్నాయన్నారు. సమావేశంలో సీపీఓ పీబీకే మూర్తి పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు