బలవంతపు భూసేకరణ తగదు

31 Aug, 2016 18:25 IST|Sakshi
  • వేములఘాట్‌లో పోలీస్ పికెట్‌ ఎత్తివేయాలి
  • డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి
  • తొగుట: కొమురవెల్లి మల్లన్నసాగర్‌ నిర్మాణంలో భాగంగా బలవంతపు  భూసేకరణ చేపట్టడం దర్మార్గమని దళిత  బహుజన ఫ్రంట్‌ ( డీబీఎఫ్‌ ) రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి ఆరోపించారు. వేములఘాట్‌లో బుధవారం మహిళలు చేపట్టిన నిరసన దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రామాల్లో  పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. పోలీస్‌ పికెట్‌ , 144 సెక‌్షన్‌ను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  వేములఘాట్‌ ప్రజలకు న్యాయం  జరిగేవరకు డీబీఎఫ్‌ అండగాఉండి పోరాడుతుందన్నారు.  

    88వ రోజుకు చేరిన ముంపు దీక్షలు
    వేములఘాట్‌ గ్రామస్తులు చేపట్టిన  దీక్షలు బుధవారం నాటికి 88వ రోజకు చేరాయి. దీక్షలో రేణుక ఎల్లమ్మ మహిళా సంఘం సభ్యులు దమ్మి రాజవ్వ , పల్లెపహాడ్‌ కిష్టవ్వ , లచ్చవ్వ , గడ్డమీది బాలవ్వ , లింగవ్వ , దొడ్ల లక్ష్మి, కూతూరి కమలమ్మ , మాచాపురం లక్ష్మి, విజయ , ప్యాట లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు