పీజీ సెంటర్‌ కళాశాల స్థలం కబ్జా

30 Aug, 2016 23:27 IST|Sakshi
కావలి : విక్రమ సింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్‌ కళాశాలకు చెందిన మూడు ఎకరాల స్థలాన్ని  పేరుమోసిన కాంట్రాక్టర్‌ ఒకరు కబ్జా చేశారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నాయుడు రవి అన్నారు. పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్లుగా ఆక్రమించిన విషయాన్ని వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ దష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందన్నారు. రూ.18 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా వర్సిటీ వారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆక్రమణల చుట్టూ కంచె వేసి విద్యార్థులను అటువైపుగా వెళ్లకుండా చేశారని ఆవేదన చెందారు. ఆ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్యదర్శి మనోజ్, నాని, శ్రీను, మణి, రమేష్‌ పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు