'టెట్రాప్యాక్ల ద్వారా మద్యం విక్రయించం'

13 Apr, 2016 14:14 IST|Sakshi
'టెట్రాప్యాక్ల ద్వారా మద్యం విక్రయించం'

విజయవాడ : బందరు పోర్టు నిర్మాణానికి మరో 10 రోజుల్లో భూ సమీకరణ ప్రక్రియ పూర్తి అవుతుందని మచిలీపట్నం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ బీసీ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. బుధవారం విజయవాడలో కొల్లు రవీంద్ర విలేకర్లతో మాట్లాడుతూ... ఇప్పటికే మచిలీపట్నం పోర్టు అథారటీ, మున్సిపల్ పరిపాలన, న్యాయ విభాగాల నుంచి క్లియరెన్స్ తీసుకుందని ఆయన వివరించారు.

పోర్టు, పరిశ్రమల నిర్మాణానికి కూడా భూమిని వేర్వేరుగా కేటాయిస్తామన్నారు. రైతులతో చర్చించి అమరావతి తరహాలోనే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. త్వరలోనే ఆధరణ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆధరణ పథకం అధ్యాయన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన విశదీకరించారు. చేతి వృత్తుల వారికి శిక్షణ ఇచ్చే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. అయితే రాష్ట్రంలో టెట్రా ప్యాక్ల ద్వారా మద్యాన్ని విక్రయించే ఆలోచన మాత్రం లేదని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

మరిన్ని వార్తలు