సాంకేతికతో భూసార పరీక్షా కేంద్రాలు బలోపేతం

7 Oct, 2016 20:43 IST|Sakshi
సాంకేతికతో భూసార పరీక్షా కేంద్రాలు బలోపేతం
  • నేషనల్‌ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌ డీడీ రజిత్‌ శర్మ
  • తుని రూరల్‌ :
    భూసార పరీక్షా కేంద్రాల బలోపేతానికి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని నేషనల్‌ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రజిత్‌ శర్మ అన్నారు. రెండో రోజు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం తుని మార్కెట్‌ యార్డులో భూసార పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వసతులు, సిబ్బంది, పరికరాల సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సిబ్బంది కొరత, అరకొర వసతులు, పరీక్షలకు అవసరమైన ముడి సరుకు ఇబ్బందులున్నాయన్నారు. ఇందుకు అవసరమైన, భూసార పరీక్ష కేంద్రాలు బలోపేతానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. జిల్లాలో ఉన్న ఆరు భూసార పరీక్ష కేంద్రాలను పరిశీలించి, నివేదికలను అందజేస్తామన్నారు. భూసార పరీక్షలపై కోటనందూరు మండలం బొద్దవరం రైతులతో చర్చించినట్టు ఆయన తెలిపారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా అందుతున్న సాగునీటి పరీక్షలు చేసి భూసారానికి అనుగుణంగా ఎరువులను సిపార్సు చేయాలని రైతులు కోరినట్టు రజిత్‌ శర్మ తెలిపారు. జిల్లాలో 62 మండలాల్లో 53,648 మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేసినట్టు వ్యవసాయశాఖ జిల్లా డీడీ కె.లక్ష్మణరావు తెలిపారు. ఏడీఏ మల్లికార్జునరావు, ఏఓలు వాణీ, సౌజన్య పాల్గొన్నారు.
     
     
మరిన్ని వార్తలు