చట్టాలపై అవగాహన అవసరం

29 Sep, 2016 23:24 IST|Sakshi
ఎచ్చెర్ల: ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి చట్టాలపై అవగాహన అవసరమని న్యాయవాది ఉషారాణి అన్నారు. ఎచ్చెర్ల సాంకేతిక శిక్షణ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి ‘కోర్టు వ్య వహారాలు, ఎదుర్కొనే న్యాయ పరమైన చిక్కులు’ అంశంపై గురువారం మానవ వనరులు శాఖ ఆధ్వర్యంలో వారం రోజులు శిక్షణ ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ చట్ట పరమైన హక్కులుంటాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు సేవలు పొందే హక్కు ఉందని తెలిపారు. పౌరసేవా పత్రం, పరిమితి లోబడి సేవలు పొందుతారన్నారు. వారి హక్కులకు అధికారులు భంగం కలిగేలా వ్యవహరిస్తే తప్పనిసరిగా వారు కోర్టులను అశ్రయిస్తారని చెప్పారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్నారు. ప్రజలకు సేవలు పొందే హక్కు, సేవలు అందించే హక్కు అధికారులకు ఉందని తెలిపారు. కోర్టు కేసుల్లో ఇరుక్కుంటే సమయం వృథాతో పాటు, సజావుగా ఉద్యోగ నిర్వహణ సాధ్యంకాదన్నారు. కార్యక్రమంలో శిక్షణ ఇన్‌చార్జి జోగారావు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు