టీడీపీ, బీజేపీల తీరుపై ప్రజలకు విసుగు

11 Nov, 2016 22:03 IST|Sakshi
  • వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు 
  • టీడీపీ, బీజేపీల నుంచి వైఎస్సార్‌లోకి భారీ చేరికలు
  • కాకినాడ రూరల్‌ : 
    ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు ప్రజల్ని దారుణంగా మోసం చేశాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. ఆ మోసాన్ని జీర్ణించుకోలేక చాలా మంది టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కన్నబాబు నివాసం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ సిటీ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ మచ్చా గంగాధర్, యువ నాయకుడు మచ్చా లోకేష్‌ వర్మలతో కలసి వివిధ డివిజన్లకు చెందిన టీడీపీ, బీజేపీలకు చెందిన 250 మంది కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి కండువాలను వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ  రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ, బీజేపీలు ఇచ్చిన హామీలను విస్మరించడం, ప్రత్యేక హోదాను తుంగలో తొక్కడంతో యువత అన్ని విధాలుగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ, టీడీపీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెందిన ప్రజలు రాష్ట్రం క్షేమం కోసం నిత్యం పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగ¯ŒSమోహ¯ŒSరెడ్డికి మద్దతుగా వేలాదిగా వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారని చెప్పారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని 24వ డివిజ¯ŒSకు చెందిన మచ్చా గంగాధర్‌తో పాటు 13, 14, 24, 25 డివిజన్లకు చెందిన వందలాది మంది మత్స్యకార ప్రజలు వైఎస్సార్‌ సీపీలో చేరడం శుభపరిణామమన్నారు. ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసిన టీడీపీ, బీజేపీలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో జరగబోయే కార్పొరేష¯ŒS ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.  
    సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో అడ్డుగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని చంద్రబాబు ప్రకటించి రెండేళ్లు గడిచినా ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఆధునిక పద్ధతుల్లో చేపల వేటకు ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని కూడా చంద్రబాబు విస్మరించారని విమర్శించారు. కాకినాడ నగర పాలక సంస్థను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
    పార్టీలో చేరిన మచ్చా గంగాధర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దారుణంగా మోసం చేశాయని విమర్శించారు. రాష్ట్రం కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న వైఎస్‌ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డికి మద్దతుగా పార్టీలో చేరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు బషీరుద్దీన్, రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి గోవిందు, కడియాల చినబాబు,  పార్టీ మహిళా నాయకులు మాదాబత్తుల భద్రావతి, కోలా సత్యవతి, మాజీ సర్పంచ్‌ బొమ్మిడి శ్రీనివాస్, చొక్కా జగన్, కర్‌?ర చక్రధర్, దుగన్న దొరబాబు, కాకినాడ మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ అక్బర్, కరీంబాషా పాల్గొన్నారు.
    పార్టీలో చేరిన వారిలో మచ్చా గంగాధర్, మచ్చా లోకేష్‌వర్మ, పెసింగి బత్తిరాజు, బలగం నాగేశ్వరరావు, బలగం వెంకటేష్, బలగం రాంబాబు, బలగం భైరవస్వామి, శేరు సూరిబాబు, బలగం శివకృష్ణ, శేరు నరసింహమూర్తి, పినపోతు చిన్న, బొడ్డు దత్తాత్రేయ, బొడ్డు ఈశ్వర్, పాలెపు చంద్రలతో పాటు సుమారు 250 మంది ఉన్నారు. వీరిలో సుమారు 15 మంది వికలాంగులు ఉండడం గమనార్హం.
     
మరిన్ని వార్తలు