లీకేజీ.. టేకిటీజీ

31 Aug, 2016 01:45 IST|Sakshi
లీకేజీ.. టేకిటీజీ
 
  • సోమశిల జలాశయంలో రోజూ సుమారు 70 క్యూసెక్కులు వృథా  అవుతున్న వైనం
  • లీకేజీ అరికట్టలేక నీటి లెక్కల్లో జిమ్మిక్కులు
70 క్యూసెక్కులు.. రోజూ జిల్లా జలనిధి సోమశిల జలాశయం నుంచి వృథా అవుతున్న నీరు.. వినేందుకు నమ్యశక్యంగా లేకున్నా ఇది నిజం. లీకేజీని అరికట్టాల్సిన అధికారులు అసలు పనిచేయకుండా నీటి గణాంకాల్లో జిమిక్కులు చేస్తున్నారు. 
సోమశిల : సోమశిల జలాశయం పెన్నార్‌ డెల్టాకు నాలుగురోజుల క్రితం విడుదల నిలుపుదల చేవారు. అయితే స్లూయిజ్‌ గేట్ల నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ గేట్ల నుంచి సుమారు 70 క్యూసెక్కుల నీరు ధారాపాతంగా పోతోంది. ఈ విషయం ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు తెలిసినా ఏ చర్య తీసుకోలేని దుస్థితి. ఈ స్లూయిజ్‌ గేట్ల ద్వారా విపరీతంగా లీకేజీ సమస్య ఉంది. గేట్ల వ్యవస్థ ప్రారంభం నుంచే ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. చూసేందుకు ఇది చిన్న సమస్యే అయినా అధికారుల చిత్తశుద్ధి లోపం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి ఇది నిరదర్శంగా ఉంటుంది. దీంతో ప్రతిసంవత్సరం నీరు వృథా అవుతూనే ఉంది.
స్లూయిజ్‌ గేట్లు మరమ్మతులకు గురై సంవత్సరాలు గడిచిచాయి. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రోలర్స్‌ కూడా మరమ్మతులు గురియ్యాయి. ఈ నేపథ్యంలో గేటు దిగడం గగనమైపోతోంది. దీంతో సుమారు 70 క్యూసెక్కులు ఒక్క రోజులోనే లీకేజీ రూపంలో వృథా అవుతున్నాయి. ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ఓ మార్గం అన్వేషించారు. వృథా నీటిని ఆవిరి రూపంలో ఖర్చయ్యే నీటి లెక్కల్లో కలిపి చూపిస్తున్నారు. ఓ వైపు జలాశయం అడుగంటుతోంది. ఇంకా మరో 16 రోజులవరకు రెండో పంటకు నీరివ్వాలి. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా మౌనంగానే ఉంటున్నారు.  
 
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : దేశ్‌నాయక్, ఇన్‌చార్జి ఈఈ, సోమశిల
సోమశిల గేట్ల లీకేజీ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొంతమంది నిపుణుల బృందం కూడా వచ్చి పరిశీలించింది. అయినా ఇది దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్య.  ఉన్నతాధికారులు దీనిని పరిశీలించారు. త్వరలోనే లీకేజీ అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం మార్గాలకు అన్వేషిస్తున్నారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా