రేపటి నుంచి ఎల్‌ఈడీ బల్బుల మార్పిడి

12 Dec, 2016 14:51 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. పాడైన ఎల్‌ఈడీ బల్బుల స్థానం లో కొత్త బల్బులను ఉచితంగా పంపిణీ చేసేందుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది. బుధవారం నుంచి రోజుకు రెండేసి మండలాల్లో బల్బుల పంపిణీకి సమాయత్తం చేశారు. ఈ మేరకు ఎస్పీడీసీఎల్ అధికారులు అవసరమైన మేర కొత్తబల్బులు సిద్ధం చేశారు. గత మార్చి, ఏప్రిల్ మాసాల్లో అధికారులు ఈఈఎస్‌ఎల్ సంస్థకు చెందిన ఎల్‌ఈడీ బల్బులను ఇంటికి రెండేసి చొప్పున పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 14.80 లక్షల బల్బులను అప్పట్లో పంపిణీ చేయగా ఇందులో 10 శాతం బల్బులు పాడయ్యాయి. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనార్థం పాడైన బల్బుల స్థానంలో కొత్త బల్బులను పంపిణీ చేయడానికి ఈఈఎస్‌ఎల్ అంగీకరించింది. దీంతో బుధవారం నుంచి పంపిణీకి వాహనాలు బయలుదేరుతున్నాయని ఎస్‌ఈ హరనాథరావు సోమవారం సాయంత్రం తెలిపారు. 
 
 ఏ రోజు ఎక్కడంటే...
 ఒక వాహనంలో ఈ నెల 23న తిరుపతి బాలాజీకాలనీ, రాజీవ్‌నగర్, 24న తిరుపతి ఉత్తరం, పశ్చిమం, 25న తిరుపతి దక్షిణం, తిరుపతి రూరల్, 26న తిరుచానూరు, సబ్‌స్టేషన్, 28న మంగళం, మంగళం రూరల్ 29న కొర్లకుంట, దామినేడు ప్రాంతాల్లో పర్యటించి, బల్బులు పంపిణీ చేస్తారు. అలాగే మరో వాహనంలో 23న ఏర్పేడు, శ్రీకాళహస్తి రూరల్, 24న కేవీబీ పురం, పాపానాయుడు పేట, 25న బుచ్చినాయుడు కండ్రిగ, తొట్టంబేడు, 26న పాకాల ఆపరేషన్, పాకాల రూరల్, 28న చంద్రగిరి, చంద్రగిరి రూరల్, 29న తిరుపతి రూరల్, కల్లూరు 30న శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి సీసీఓ వద్ద పంపిణీ చేస్తారు. అలాగే మూడో వాహనంలో 23న చిన్నగొట్టిగల్లు, ఎర్వ్రారిపాళెం, 24న రొంపిచెర్ల, పీలేరు రూరల్, 25న పీలేరు, గర్నిమిట్ట 26న సదుం, సోమల 28న కలికిరి, కలకడ, 29న వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో పంపిణీ చేస్తారు. 
 
 నాలుగో వాహనంలో 23న రాయలచెరువు, వెదురుకుప్పం, 24న వడమాలపేట, పుత్తూరు 25న పుత్తూరు రూరల్, నారాయణవనం 26న నిండ్ర, పిచ్చాటూర్, 28న నగరి, నగరి రూరల్ 29న కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం, 30న వరదయ్యపాలెం, చెరివి ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నాగలాపురం, పన్నూరు, 2న సత్యవేడు మండలాల్లో పంపిణీ చేయనున్నారు. 
 
 చిత్తూరు డివిజన్‌లో..
 అలాగే చిత్తూరు డివిజన్‌లో డిసెంబరు ఒకటో తేదీన పూతలపట్టు, మిట్టూరు, 2న సంతపేట, గిరింపేట, 3న కొంగారెడ్డిపల్లి, చిత్తూరు రూరల్, 5న పెనుమూరు, గంగాధర్‌నెల్లూరు 6న ఆవల్‌కొండ, పాలసముద్రం, 7న రొంపిచెర్ల, పీలేరు రూరల్ 8న కొత్తపల్లి, రెడ్గిగుంట మండలాల్లో పంపిణీ చేస్తారు. రెండో వాహనం ద్వారా డిసెంబరు ఒకటిన అరగొండ, పైపల్లి, 2న ఐరాల, ఐరాల రూరల్,  3న బంగారుపాళెం, యాదమర్?ర, 5న బంగారుపాళెం, రూరల్, గంగవరం, 6న పలమనేరు, పలమనేరు రూరల్ 7న బెరైడ్డిపల్లి, వీ.కోట మండలాల్లో పంపిణీ చేస్తారు. మూడో వాహనం ద్వారా నబంబరు 30న నిమ్మనపల్లి, చౌడేపల్లి, డిసెంబరు ఒకటో తేదీన పెద్దపంజాణి, పుంగనూరు, 2న పుంగనూరు, రామసముద్రం, 3న మదనపల్లి ఈస్ట్, మదనపల్లి నార్త్, 5న మదనపల్లి వెస్ట్, మదనపల్లి టౌన్, 6న కురబలకోట, బీ. కొత్తకోట, 7న పెద్ద తిప్పసముద్రం, ములకలచెరువు, 8న తంబళ్లపల్లి, పెద్దమండ్యం, 9న సీటీఎం మండలాల్లో పాడైన బల్బులకు కొత్త బల్బులు పంపిణీ చేయనున్నారు.  
 
>
మరిన్ని వార్తలు