మహమ్మారి పడగ

10 Mar, 2017 23:59 IST|Sakshi
  • జిల్లాలో 290 మంది కుషు్ఠవ్యాధిగ్రస్తులు
  • అందులో చిన్నారులు 36 మంది
  • భర్తీకాని వైద్యుల పోస్టులు
  •  
    జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వైద్యం కోసం పాలకులు రూ.కోట్లు వెచ్చిస్తున్నామని చెబుతున్నా.. ఆచరణలో అరకొర సౌకర్యాలు, చాలని వైద్య సిబ్బందితో రోగులకు సేవలందక వ్యాధి ప్రభావం పెరుగుతోంది. 
    కాకినాడ వైద్యం : 
    ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం జిల్లాలో ఫిబ్రవరి నెలాఖరుకు 290 మంది కుషు్ఠవ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇందులో 36 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం పదివేల మంది జనాభాకు 0.53 శాతం మందికి వ్యాధి తీవ్రతను తగ్గించినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. 1987 సంవత్సరం నాటికి జిల్లాలో 26,028 వ్యాధిగ్రస్తులు ఉండగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు 95,966 మందికి చికిత్స అందించినట్టు అధికారులు చెబుతున్నారు. రోగులకు మల్టీ డ్రగ్‌ థెరపీ (ఎండీటీ) చికిత్స అందించడంతో వ్యాధి తీవ్రతను తగ్గించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. . 2015–16 సంవత్సరంలో జిల్లాలో 390 వ్యాధిగ్రస్తులుండగా, ఇందులో 48 మంది చిన్నారులు ఉన్నారు. ఈ వ్యాధి తీవ్రతతో అంగవైకల్యానికి గురైన 1,853 మంది బాధితులకు సామాజిక పింఛన్లు, 999 మందికి వృద్ధాప్య పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. ఇదికాకుండా 2,095 మందికి అంత్యోదయ కార్డులను మంజూరు చేసింది. వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో 16 కాలనీలను నిర్మించింది. వ్యాధి నియంత్రణ, గుర్తింపు కోసం పారా మెడికల్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి కుషు్ఠవ్యాధిగ్రస్తుల సంఖ్యను గుర్తించాలి. అయితే ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో బాధితులకు సకాలంలో సేవలు అందించలేకపోతున్నారు. ఫలితంగా పూర్తిగా తగ్గిపోయిందనుకున్న కుషు్ఠవ్యాధి మెల్లమెల్లగా విజృంభిస్తోంది. 
     
    అరకొర సిబ్బందితో వైద్యసేవలు
    జిల్లాలో కుషు్ఠవ్యాధి నిర్మూలన కోసం 35 మంది డిప్యూటీ పారా మెడికల్‌ ఆఫీసర్లు పని చేయాల్సి ఉండగా, 23 మందితోనే గత కొన్నేళ్లుగా నెట్టుకొస్తున్నారు. అలాగే 72 మంది అసిస్టెంట్‌ పారా మెడికల్‌ ఆఫీసర్స్‌ పని చేయాల్సి ఉండగా 24 మందితోనే రోగులకు సేవలు అందిస్తున్నారు. డీపీఎంవోలు, ఏపీఎంలు జిల్లాలో ఉన్న 28 ప్రధాన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. 4–5 పీహెచ్‌సీలను కలిపి ఒక మెయి¯ŒS పీహెచ్‌సీగా కుషు్ఠవ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పారా మెడికల్‌ సిబ్బంది పోస్టులు భర్తీ కాకపోవడంతో గ్రామస్థాయిలో సర్వే చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా బాధితుల సంఖ్య నానాటికీ పెరిగే అవకాశం ఉంది. తక్షణం సిబ్బంది భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలోని కుషు్ఠవ్యాధి వార్డు అధ్వానంగా తయారైంది. ఇక్కడ బెడ్స్‌ రోగులు పడుకునేందుకు అనువుగా లేవు. వార్డులో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.  
    చికిత్స ఇలా
    స్టేజ్‌–1 పీబీ (పోసిబుల్‌ బాసీ)
    ∙ 1–5 మచ్చలు, చర్మపు పూత వస్తే ఆరు నెలల చికిత్స మల్టీ డ్రగ్‌ థెరఫీ (ఎండీటీ) అందిస్తారు. ఇందులో రిపాంసిన్, లేంప్రిన్, దార్సూ¯ŒS అనే మూడు మందులు ఉంటాయి. వీటినే ఎండీటీ అంటారు.
    స్టేజ్‌–2 మల్టీబాసీ  
    ∙ ఆరు అంతకు పైన వచ్చే మచ్చలు, 2 పైన నరాలకు వ్యాధిసోకితే 12 నెలల పాటు చికిత్స అందిస్తారు. వీరికి కూడా ఎండీటీ చికిత్స అందిస్తారు.  
    ∙ కుషు్ఠవ్యాధి నిర్మూలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి విజయవాడ ఏపీఎస్‌ఎల్‌వోకు డ్రగ్స్‌ సరఫరా అవుతాయి. విజయవాడ నుంచి ప్రతి మూడు నెలలకోసారి జిల్లాకు మందులు సరఫరా అవుతుంటాయి.
     
    సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకోవాలి
    వ్యాధి తీవ్రతను గుర్తించేందుకు ప్రభుత్వం పారా మెడికల్‌ వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి. గతంలో సర్వేలు చేపట్టేవారు. ప్రస్తుతం అప్పుడప్పుడూ నిర్వహిస్తున్నారు. నేను నలభై సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతున్నా. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నా. వార్డులో సౌకర్యాల 
    కల్పనకు చర్యలు తీసుకోవాలి. 
    – జి.భద్రరావు, బాధితుడు, జగ్గంపేట
     
    అపోహలు విడనాడాలి
    కుషు్ఠవ్యాధి పట్ల అపోహలు వీడాలి. ఈ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. ప్రజల్లో ముఖ్యంగా ఏజెన్సీలో కుషు్ఠవ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు జనవరి 30వ తేదీన స్పర్శ అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 32 కేసులను గుర్తించాం. ఈ ఏడాది పాక్షిక అంగవైకల్యం కలిగిన 27 మందికి రీకనస్ట్రక్టివ్‌ సర్జరీ ద్వారా రోగాన్ని నయం చేశాం. అర్హులైన వారికి సామాజిక పింఛన్లను అందిస్తున్నాం.
     
    – డాక్టర్‌ ఎం.పవ¯ŒSకుమార్, 
    జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి(ఎయిడ్స్, లెప్రసీ)
     
     
మరిన్ని వార్తలు